ETV Bharat / bharat

15 రోజుల్లోనే 3 సార్లు గృహ నిర్భంధం: ముఫ్తీ - పీడీపీ అధ్యక్షురాలు

తనను అక్రమంగా గృహనిర్బంధం చేశారని మరోమారు ఆరోపించారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనని నిర్బంధించారని ట్విట్టర్​ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.

mehabooba mufti
పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ
author img

By

Published : Dec 9, 2020, 2:10 PM IST

భద్రత కారణాల పేరుతో తనను మరోమారు అక్రమంగా నిర్బంధించారని ఆరోపించారు జమ్ముకశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ. పక్షం రోజుల్లోనే మూడోసారి తనను నిర్బంధించారని.. ప్రస్తుతం జరుగుతోన్న డీడీసీ ఎన్నికల ప్రచారానికి భాజపా మంత్రులను అనుమతించి తనపై ఆంక్షలు విధించటమేంటని ట్విట్టర్​ వేదికగా మండిపడ్డారు.

  • Illegally detained today for the third time in less than a fortnight. Too much democracy indeed. If my movements are curbed due to ‘security concerns’ then why are BJP ministers allowed to campaign freely in Kashmir while Ive been asked to wait until culmination of DDC elections? pic.twitter.com/H3v0ixISrL

    — Mehbooba Mufti (@MehboobaMufti) December 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" 15 రోజుల్లోనే మూడోసారి ఇవాళ అక్రమంగా నిర్బంధించారు. ఇది చాలా ఘోరమైన ప్రజాస్వామ్య పరిస్థితి. భద్రతాపరమైన ఆందోళనలతో నా ప్రయాణాలను అడ్డుకున్నప్పుడు.. కశ్మీర్​లో భాజపా మంత్రులు స్వేచ్ఛగా ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఎలా ఇచ్చారు? "

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

బుద్గాం జిల్లాలో పర్యటించేందుకు వెళ్లే ముందు శ్రీనగర్​ గుప్కర్​ రోడ్డులోని తన నివాసంలో గృహ నిర్బంధం చేశారని మంగళవారం ఆరోపించారు ముఫ్తీ. తాజాగా మరోమారు ట్విట్టర్​ వేదికగా కశ్మీర్​ అధికార యంత్రాంగంపై విమర్శలు చేశారు.

ఇదీ చూడండి: మళ్లీ గృహ నిర్బంధంలోకి ముఫ్తీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.