MECL Recruitment 2023 : నాగ్‌పుర్‌లోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఈసీఎల్) ఆధ్వర్యంలోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్ జాబ్ నోటిఫికేషన్ ( MECL Jobs 2023 ) విడుదల చేసింది. మొత్తం 94 పోస్టులను భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఆగస్టు 14 నుంచి ప్రారంభమయిన ఈ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 13 వరకు కొనసాగనుంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు..
MECL Vacancy 2023 : 94 పోస్టులు.
41 ఎగ్జిక్యూటివ్ ఖాళీలు..
- మేనేజర్ - 1
- కెమిస్ట్ - 5
- ప్రోగ్రామర్ - 4
- జియోఫిజిస్ట్ - 5
- జియాలజిస్ట్ - 14
- ఎలక్ట్రికల్ ఇంజినీర్ - 1
- అకౌంట్స్ ఆఫీసర్ - 3
- అసిస్టెంట్ మేనేజర్ - 5
- హ్యూమన్ రీసోర్స్ ఆఫీసర్ - 1
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫినాన్స్) - 1
- ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ ఆఫీసర్ - 1
53 నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులు..
- ఎలక్ట్రీషియన్ - 1
- అసిస్టెంట్ - 20
- అకౌంటెంట్ - 6
- టెక్నీషియన్ - 25
- హిందీ ట్రాన్స్‌లేటర్ - 1
విభాగాలు..
అకౌంట్స్, మెటీరియల్స్, ల్యాబొరేటరీ, హెచ్‌ఆర్, హిందీ, సాంప్లింగ్ తదితరాలు.
గరిష్ఠ వయోపరిమితి
- మేనేజర్ - 45 ఏళ్లు.
- అసిస్టెంట్ మేనేజర్ - 40 ఏళ్లు.
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫినాన్స్) - 50 ఏళ్లు.
- ఎలక్ట్రికల్ ఇంజినీర్, జియాలజిస్ట్, జియోఫిజిస్ట్, కెమిస్ట్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రోగ్రామర్, హెచ్‌ఆర్ ఆఫీసర్ - 30 ఏళ్లు.
- నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు 30 ఏళ్ల గరిష్ఠ వయోపరిమితిని విధించారు.
విద్యార్హతలు..
MECL Job Eligibility : ఆయా పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో మెట్రిక్యులేషన్, ఐటీఐ, బీఎస్సీ, బీఏ, బీకామ్, బీబీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ, గ్రాడ్యుయేషన్, సీఏ, ఐసీడబ్ల్యూఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
పని అనుభవం..
నాన్-ఎగ్జిక్యూటివ్ అభ్యర్థులకు కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు కూడా పని అనుభవం తప్పనిసరి.
జీతభత్యాలు..
- మేనేజర్ - నెలకు రూ.2,00,000/-
- అసిస్టెంట్ మేనేజర్ - నెలకు రూ.1,80,000/-
- డిప్యూటీ జనరల్ మేనేజర్ (ఫినాన్స్) - నెలకు రూ.2,40,000/-
- ఎలక్ట్రికల్ ఇంజినీర్, జియాలజిస్ట్, జియోఫిజిస్ట్, కెమిస్ట్, ప్రొక్యూర్మెంట్ అండ్ కాంట్రాక్ట్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, ప్రోగ్రామర్, హెచ్‌ఆర్ ఆఫీసర్ - నెలకు రూ.1,40,000/-
- టెక్నీషియన్, అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్ - నెలకు రూ.49,300/-
- అకౌంటెంట్, హిందీ ట్రాన్స్‌లేటర్ - నెలకు రూ.55,900/-
ఇలా షార్ట్‌లిస్ట్ చేస్తారు..
- రాతపరీక్ష
- స్కిల్‌టెస్ట్
- ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
దరఖాస్తు ఫీజు..
MECL Recruitment 2023 Application Fees : ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్, డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు అప్లికేషన్ రుసుము నుంచి మినహాయింపును కల్పించారు. అంటే వీరు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు. మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు రూ.100/-ను దరఖాస్తు ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం..
MECL Nagpur Recruitment 2023 : ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది..
MECL Jobs Last Date : 2023 సెప్టెంబర్ 13.
వెబ్సైట్..
MECL Website : నోటిఫికేషన్‌కి సంబంధించి పూర్తి వివరాల కోసం MECL అధికారిక వెబ్సైట్ https://www.mecl.co.in/ను చూడవచ్చు.
జాబ్ లొకేషన్..
MECL Job Location : ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా MECLకి సంబంధించిన ప్రాజెక్ట్స్ లేదా కార్పొరేట్ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉంటుంది.