ETV Bharat / bharat

ఘోర అగ్నిప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవదహనం - మొరదాబాద్​లో అగ్నిప్రమాదం

ఉత్తర్​ప్రదేశ్​లోని మొరాదాబాద్​లో జరిగిన అగ్నిప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఐదుగురు సజీవదహనమయ్యారు. మరో ఏడుగురు స్వల్పగాయాలతో బయటపడ్డారు. షార్ట్​ సర్క్యూట్​ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.

UP: Massive fire breaks out at multi-storey building in Moradabad

author img

By

Published : Aug 26, 2022, 8:28 AM IST

Fire Accident Moradabad: ఉత్తర్​ప్రదేశ్​లోని మొరాదాబాద్​ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ ఇంట్లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడం వల్ల లోపల ఉన్న ముగ్గురు చిన్నారులు సహా ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది.. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

UP: Massive fire breaks out at multi-storey building in Moradabad
ఎగిసిపడుతున్న మంటలు

ఇదీ జరిగింది.. మొరాదాబాద్​లోని అమరుద్దీన్​ అనే వ్యక్తి తన ఇంటి మూడో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే ఇంట్లో ఉన్న వారంతా సహాయం కోసం ఆర్తనాదాలు చేశారు. అవి విన్న స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. మరొకరు అగ్నిమాపక సిబ్బందికి విషయాన్ని తెలియజేశారు. వెంటనే చేరుకున్న ఫైర్​ సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.

ప్రాణాలతో ఉన్న ఏడుగురిని కాపాడారు. ఎగిసిపడిన మంటల కారణంగా అమరుద్దీన్​ అత్త సమర్, కోడలు షామా, కుమార్తె నఫియా, కుమారుడు ఇబాద్​తో పాటు మరో వ్యక్తి మరణించారు. అయితే ఈ ప్రమాదానికి షార్ట్​ సర్క్యూట్​ కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, దర్యాప్తు చేపడతామని పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: తల్లి ఒడిలో నుంచి 7 నెలల చిన్నారి అపహరణ, సీసీటీవీ దృశ్యాలు వైరల్

వీధి కుక్కలపై యాసిడ్​తో దాడి, బాలుడి పైశాచికత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.