గుజరాత్ కఛ్‌లో భాజపా ఎంపీ అరుదైన రికార్డును నెలకొల్పారు. 2వేలకుపైగా తులసి మొక్కలతో భారీ భారతీయ జనతా పార్టీ లోగోను తయారు చేసి రికార్డును సృష్టించారు. పార్లమెంట్ సభ్యుడు వినోద్ చావ్డా నిర్వహించిన ఈ కార్యక్రమం వరల్డ్ రికార్డ్స్ ఇండియాలో స్థానం సంపాదించుకుంది. సుమారు 2,872 తులసి మొక్కలతో పార్టీ లోగో అయిన కమలం ఆకారంలో పేర్చారు. 2,500 మొక్కలతో చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2,782 మొక్కలతో పూర్తి చేశారు. దీనిని 4.30 గంటల సమయంలో పూర్తి చేశారు. 30 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు.
"భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రికార్డును నెలకొల్పారు. సుమారు 2,872 తులసి మొక్కలను ఉపయోగించి పార్టీ లోగోను తయారు చేశారు. కఛ్ ఎంపీ వినోద్ చావ్డా ఆధ్వర్యంలో ఈ రికార్డు సాధించారు. 2,500 మొక్కలతో చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా.. 2,782 మొక్కలతో పూర్తి చేశారు. 4.30 గంటల సమయంలో.. 30 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు."
-దేవయాని సోని, వరల్డ్ రికార్డ్స్ ఇండియా ప్రతినిధి
అజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గుజరాత్ కఛ్‌లో జరిగే ఉత్సవాలకు హాజరుకానున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా రికార్డుతో మోదీకి స్వాగతం పలకనున్నారు. ఈ పర్యటనలో అనేక అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు ప్రధాని. అనంతరం మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న పలు రకాల క్రీడా పోటీలను ప్రారంభించనున్నారు. తర్వాత ప్రధానమంత్రి యోగా మహోత్సవ్ పేరిట నిర్వహిస్తున్న భారీ యోగా కార్యక్రంలో పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: భారత ప్రధాన న్యాయమూర్తుల్లో 9 మంది దక్షిణాది వారే