Manipur Violence News Today : మణిపుర్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని లాంగోల్ గ్రామంలో 15 ఇళ్లకు నిప్పంటించాయి అల్లరిమూకలు. 45 ఏళ్ల వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో బాధితుడు ఎడమతొడకు బుల్లెట్ గాయమైంది. ప్రస్తుతం అతడు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడికి ప్రాణాపాయం లేదని సమాచారం. అల్లరిమూకలను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. అనంతరం పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చారు. శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని చెకాన్‌లో కూడా ఓ వాణిజ్య నిర్మాణం సహా మూడు ఇళ్లకు నిప్పంటించారు నిరసనకారులు. మరోవైపు కాంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలకు, తీవ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఒక వ్యక్తి నుంచి 50 రౌండ్లతో కూడిన ఎస్ఎల్ఆర్ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్లు వారు వెల్లడించారు. 27 అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కమిటీ.. 24 గంటల సార్వత్రిక సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు జరిగాయి. మూడు నెలల కింద మొదలైన ఉద్రిక్తతలు.. ఇప్పటివరకు కొనసాగడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
మణిపుర్‌లో ఆగని హింస.. నిద్రిస్తున్న తండ్రీకొడుకులు సహా ముగ్గురి హత్య..
Manipur violence : శుక్రవారం అర్ధరాత్రి మణిపుర్‌లో హింసకాండ కొనసాగింది. బిష్ణుపుర్ జిల్లాలో జరిగిన ఘటనలో తండ్రి, కుమారుడు సహా ముగ్గురు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. క్వాక్తా సమీపంలోని ఉఖా తంపక్ గ్రామంలోకి ఆయుధాలతో ప్రవేశించిన కొందరు దుండగులు.. నిద్రిస్తున్న ముగ్గురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అనంతరం వారిపై కత్తులతో దాడిచేసి నరికి చంపారు. కాల్పులకు పాల్పడిన దుండగులను సమీప ప్రాంతంలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. భద్రతా దళాలు.. వారిని అదుపులోకి తీసుకునేందుకు యత్నించాయని వెల్లడించారు. ఈ క్రమంలో పోలీసులు, దుండగులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Manipur Violence Why : గత కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రం మణిపుర్ హింసాత్మక పరిస్థితులో నెలకొన్నాయి. ఎస్టీ హోదా కోసం మెయిటీల డిమాండ్‌కు మణిపుర్ వ్యాలీ ప్రాంతానికి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు లభించింది. దీంతో గిరిజన ప్రాంత ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతరం ఇది ఘర్షణలకు దారితీసింది. మణిపుర్ రాష్ట్ర జనాభాలో 53 శాతం మంది మెయిటీ వర్గానికి చెందినవారే ఉన్నారు. మణిపుర్ వ్యాలీలోనూ వారి ప్రాబల్యం ఎక్కువగా ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ నుంచి వస్తోన్న అక్రమ వలసదారులతో తాము సమస్యలు ఎదుర్కొంటున్నామని వారు చెబుతున్నారు.
'పెద్ద నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాదే! అందుకే ప్రపంచంలో దేశ ఖ్యాతి పెరిగింది'
'మణిపుర్ మహిళల్ని రాజ్యసభకు నామినేట్ చేయాలి'.. రాష్ట్రపతికి విపక్షాల అభ్యర్థన