Manipur Internet Restore : రెండు జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో మొబైల్ ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తామని ఆ రాష్ట్ర సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. మే3న నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలు.. శనివారం పునరుద్ధరించునున్నట్లు ఆయన వెల్లడించారు. భారత్-మయన్మార్ సరిహద్దుకు ఇరువైపులా నివసించే ప్రజలు ఎటువంటి పత్రాలు లేకుండా ఒకరి భూభాగంలోకి వెళ్లేందుకు అనుమతించడాన్ని నియంత్రించాలని ఆయన పిలుపునిచ్చారు.
భారత్- మయన్మార్ సరిహద్దులో కంచె ఏర్పాటు అవసరమే!
Manipur Internet Update : "నకిలీ వార్తల ప్రచారం, ద్వేషపూరిత ప్రసంగాల వ్యాప్తిని నిరోధించడానికి మే3వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. అయితే రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడడం వల్ల నేటి నుంచి ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరిస్తున్నాం" అని విలేకరుల సమావేశంలో సీఎం బీరెన్ సింగ్ తెలిపారు. భారత్- మయన్మార్ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు.
-
#WATCH | From today onwards, internet services will be opened for the public, says Manipur CM N Biren Singh pic.twitter.com/GqP3eR4tmM
— ANI (@ANI) September 23, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | From today onwards, internet services will be opened for the public, says Manipur CM N Biren Singh pic.twitter.com/GqP3eR4tmM
— ANI (@ANI) September 23, 2023#WATCH | From today onwards, internet services will be opened for the public, says Manipur CM N Biren Singh pic.twitter.com/GqP3eR4tmM
— ANI (@ANI) September 23, 2023
గత ప్రభుత్వాల నిర్ణయాల వల్లే ఇలా..
Manipur Border Fencing : మణిపుర్ సరిహద్దులో 60 కిలోమీటర్ల మేర కంచె వేయడానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టిందని సీఎం బీరెన్ సింగ్ చెప్పారు. గత ప్రభుత్వాల అనాలోచిత విధానాల వల్లే ప్రస్తుత పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. తాము తీసుకున్న నిర్ణయాల వల్ల ఎటువంటి నష్టం జరగలేదని వెల్లడించారు.
'ఆయుధాలను అప్పగించండి లేదా చర్యలు ఎదుర్కోండి'
Manipur Weapons Surrender : 15 రోజుల్లోగా అక్రమ ఆయుధాలను అప్పగించాలని లేదంటే భద్రతా దళాలు తీసుకున్న చర్యలను ఎదుర్కోవాలని మణిపుర్ ప్రభుత్వం.. ప్రజలకు తెలిపింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. "15 రోజుల తర్వాత అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకునేందుకు.. కేంద్ర, రాష్ట్ర బలగాలు విస్త్రతమైన సెర్చ్ ఆపరేషన్ నిర్వహించనున్నాయి. ఈ సమయంలో అక్రమ ఆయుధాలతో పట్టుబడితే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం. అక్రమ ఆయుధాలు ఉపయోగించి జరిగిన దోపిడీలు, బెదిరింపులకు సంబంధించిన పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. ఇది చాలా తీవ్రమైన విషయం. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలి" అని ప్రకటనలో సీఎంవో పేర్కొంది.
సుప్రీంకు మణిపుర్ సర్కార్ నివేదిక
Manipur Weapons Recovered : అక్రమ ఆయుధాలను స్వాధీనం చేసుకున్న విషయంపై మణిపుర్ ప్రభుత్వం.. సుప్రీంకోర్టుకు శుక్రవారం నివేదికను సమర్పించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనానికి భారత సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా నివేదికను సమర్పించారు. ఆయుధాలకు సంబంధించిన అంశం అత్యంత సున్నితమైనది కాబట్టి నివేదికను గోప్యంగా స్వీకరించేందుకు సీజేఐ ధర్మాసనం అంగీకరించింది.