ETV Bharat / bharat

Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్స్‌ క్లీన్​ చేస్తున్న 'రోబో'.. 360 డిగ్రీల్లో.. చిన్నమరక కూడా లేకుండా.. - చండీగఢ్ మ్యాన్​హోల్స్​ రోబోలు

Manhole Cleaning Robot : మ్యాన్​హోల్​ శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు చాలా కష్టపడతారు. అలా శుభ్రం చేసే క్రమంలో విష వాయువులు లీకై ప్రమాదాల బారిన కూడా పడుతుంటారు. అయితే ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు చండీగఢ్​ కార్పోరేషన్ అధికారులు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. రోబోలతో శుభ్రం చేయిస్తున్నారు. ఆ సంగతులు మీకోసం..

manhole cleaning robot story of bandicoot sewage cleaning robot in chandigarh

author img

By

Published : Aug 12, 2023, 7:28 PM IST

మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేస్తున్న 'రోబో'లు.. చిన్నమరక కూడా లేకుండా..

Manhole Cleaning Robot : మ్యాన్‌హోల్ ఈ పేరు వినగానే కొందరికి భయం వేస్తుంది. మరికొందరైతే మ్యాన్‌హోల్ కనిపిస్తే ముక్కు మూసుకుంటారు. కానీ పారిశుద్ధ్య కార్మికులు.. వాటి లోపలికి దిగి శుభ్రం చేస్తారు. మురుగును శుభ్రం చేసే క్రమంలో విష వాయువులు విడుదలై పారిశుద్ధ్య కార్మికులు ప్రమాదాల బారినపడిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ ప్రమాదాలను నివారించేందుకు చండీగఢ్‌ కార్పోరేషన్‌ అధికారులు సరికొత్త ఉపాయం చేశారు.

Manhole Bandicoot Cleaning Robot : పంజాబ్, హరియాణా రాష్ట్రాల ఉమ్మడి రాజధాని చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌లో మ్యాన్‌ హోల్స్‌ శుభ్రం చేసేందుకు కొత్త పద్ధతిని అనుసరిస్తున్నారు. కార్మికులు ఆ పని చేస్తుండగా ప్రమాదాలు జరగటం వల్ల 'బ్యాండికూట్' అనే రోబోలకు అప్పగించారు. ఈ రోబోలు మురుగును శుభ్రం చేస్తుండగా వాటి నిర్వహణ బాధ్యతను పారిశుద్ధ్య కార్మికులకు అప్పగించారు. రోబోలను నిర్వహించేందుకు పారిశుద్ధ్య కార్మికులకు శిక్షణ ఇస్తున్నారు.

360 డిగ్రీల..
Bandicoot Sewage Cleaning Robot : బ్యాండికూట్ రోబో యంత్రం అధునాతన సాంకేతికతతో పనిచేస్తుంది. ఈ రోబోకు 360 డిగ్రీల పరిధిలో నాలుగు కెమెరాలు ఉంటాయి. అంతేకాదు మ్యాన్‌హోల్స్‌లో విష వాయువులను గుర్తిస్తుంది. మురుగు కాలువలోని ప్రతిమూలా శుభ్రం చేస్తుంది. ప్రస్తుతం చండీగఢ్ మున్సిపల్ కార్పోరేషన్‌ పరిధిలో మ్యాన్‌హోల్స్‌ శుభ్రంచేసే పనిని ఇప్పుడు రోబోలతో చేయిస్తున్నారు.

చిన్న మరక లేకుండా..
Bandicoot Robot Working : గతంలో మ్యాన్‌హోల్స్‌ శుభ్రంచేసే సమయంలో ఇబ్బందులు తలెత్తేవని, అందులో విష వాయువుల కారణంగా కళ్లు మండేవని కార్మికులు చెప్పారు. మ్యాన్‌హోల్‌ లోపలికి దిగి శుభ్రం చేసే పని కావడం వల్ల చర్మ సమస్యలు కూడా వచ్చేవన్నారు. ఇప్పుడు చిన్నమరక కూడా లేకుండా మ్యాన్‌హోల్స్‌ శుభ్రం చేయగలుగుతున్నట్లు పారిశుద్ధ్య కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. కేరళ సహా పలు రాష్ట్రాల్లో ఈ తరహా యంత్రాలను మురుగును శుభ్రం చేసేందుకు వినియోగిస్తున్నారు.

అక్కడి ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లుగా రోబోలు!
Robots as Teachers: విద్యార్థులకు శ్రమ తెలియకుండా పాఠాలు చెప్పి వారి సందేహాలు తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం వినూత్న ప్రయత్నం చేసింది. రోబో సినిమాలో చిట్టీలాగ.. పిల్లలకు ఆసక్తికరంగా పాఠాలు చెప్పడమే కాక వారు అడిగిన డౌట్లను టక్కున క్లియర్​ చేసేందుకు ఓ రోబోను తీసుకొచ్చింది. ఈగల్​ పేరుతో ఈ రోబోను బెంగళూరులోని మల్లేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన పూర్తి వార్త కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

50 నిమిషాల్లోనే 1,484 అగ్రో రోబోలు తయారీ.. చైనా రికార్డ్ బ్రేక్ చేసిన విద్యార్థులు​

ఔరా అనిపించే రోబోలు.. అచ్చం మనుషుల్లానే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.