పాకిస్థాన్ జైళ్లో ఎనిమిదేళ్ల శిక్షా కాలాన్ని పూర్తి చేసుకుని ఓ భారతీయుడు ఇటీవల విడుదలయ్యాడు. కాన్పూర్‌కు చెందిన షామ్సుద్దిన్ అనే వ్యక్తి.. కరాచీ జైలు నుంచి విడుదలై ఆదివారం సాయంత్రం తన ఇంటికి చేరుకున్నాడు.
జైలు నుంచి విడుదలైన తర్వాత షామ్సుద్దిన్ తొలుత అమృత్సర్ క్వారెంటైన్ సెంటర్లో ఉన్నాడు. అన్ని రకాల అధికారిక ప్రక్రియలు పూర్తైన తరవాత అతన్ని ఇంటికి పంపించారు పోలీసులు. జైలు శిక్షతో కలిపి పాకిస్థాన్ నుంచి 28 ఏళ్ల తర్వాత షామ్సుద్దిన్ ఇంటికు చేరుకున్న నేపథ్యంలో..అతని కుటుంబ సభ్యులు సంబురాలు జరుపుకున్నారు.
ఇంటి నుంచి వెళ్లిపోయి.. పాక్‌లో నివాసం..
1992లో షామ్సుద్దిన్ తన తండ్రితో గొడవపడి దిల్లీకి వెళ్లిపోయాడు. అక్కడి నుంచి సౌదీ వెళ్లాలనుకున్నాడు కానీ.. తనకు తెలిసిన ఓ వ్యక్తి వల్ల పాకిస్థాన్‌కు చేరుకున్నాడు.
90రోజుల వీసాతో పాకిస్థాన్‌కు వెళ్లిన షామ్సుద్దిన్. అంతర్గత అల్లర్ల కారణంగా వీసా ముగిసిన తర్వాత కూడా అక్కడే ఉండిపోయాడు. అలాంటి పరిస్థితుల్లో వీసా అప్డేట్ కోసం ప్రయత్నిస్తే పోలీసులు అరెస్టు చేయొచ్చని స్నేహితులు సలహా ఇచ్చారు.
దీనితో స్నేహితుల సాయం తీసుకుని ఓల్డ్ మోహళ్లాను వదిలి.. కరాచీలో నివసించడం ప్రారంభించాడు షామ్సుద్దిన్. అక్కడే పని చేస్తూ.. ఓ అధికారికి లంచమిచ్చి నేషనల్ ఐడెంటిటీ కార్డ్ (ఎన్ఐసీ)ను పొందాడు.
1994లో తన భార్యా, ఇద్దరు పిల్లలను పాకిస్థాన్‌కు పిలిపించుకున్నాడు. 2002లో పాక్‌లో ముషారఫ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీనితో మళ్లీ తన కుటుంబాన్ని తిరిగి కాన్పూర్ పంపించాడు షామ్సుద్దిన్.
2012లో షామ్సుద్దిన్ కాన్పూర్‌కు వచ్చేందుకు పాస్‌పోర్ట్ కార్యాలయానికి వెళ్లగా.. అతన్ని భారతీయడిగా గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను భారత గూఢాచారిగా అనుమానించి జైళ్లో పెట్టారు.
తనకు భారత ఆర్మీతో సంబంధం లేదని చెప్పినా.. అక్రమంగా దేశం దాటేందుకు ప్రయత్నించాడనే కారణాలతో 2012 అక్టోబర్ 24 నుంచి జైళ్లో ఉంచారు. ఎనిమిదేళ్ల తర్వాత ఈ ఏడాది అక్టోబర్ 26న షామ్సుద్దిన్ను భారత ఆర్మీకి అప్పగించారు.
తన విడుదలకు కోసం కృషి చేసిన వారందరికి కృతజ్ఞతలు తెలిపాడు షామ్సుద్దిన్.
ఇదీ చూడండి:పల్సర్ 150సీసీ ఇంజిన్‌తో సరికొత్త కారు