ETV Bharat / bharat

గొడ్డలితో భార్య, కూతురిని నరికి చంపిన భర్త.. తర్వాత సూసైడ్​..

గొడ్డలితో నరికి భార్య, కూతురిని కిరాతకంగా హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు.. రైల్వే స్టేషన్​లోని అడ్వటైజ్​మెంట్​ డిస్​ప్లే బోర్డును.. సైబర్​ నేరగాళ్లు హ్యాక్​ చేశారు. అందులో పోర్న్​ వీడియోలు ప్లే చేశారు. బిహార్​లో జరిగిందీ ఘటన.

young man killed wife and daughter
young man killed wife and daughter
author img

By

Published : Mar 20, 2023, 10:34 AM IST

భార్య, నాలుగేళ్ల కూతురిని గొడ్డలితో నరికి హత్య చేశాడు ఓ వ్యక్తి. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణం ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఉన్నావ్​లో ఆదివారం రాత్రి జరిగిందీ దారుణం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతులను మోహన్​, సీమ, వారి నాలుగేళ్ల కూతురుగా పోలీసులు గుర్తించారు. వీరంతా భగవంత్ నగర్ ప్రాంతంలోని నరేంద్రపుర్ గ్రామస్థులు. రాత్రి నిద్రపోయే సమయంలో మోహన్, అతని భార్య సీమకు మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. దీంతో క్షణికావేశంలో మోహన్​ భార్య సీమను గొడ్డలితో నరికాడు. అనంతరం తన నాలుగేళ్ల కూతురి పైనా వేటు వేశాడు. దీంతో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత మోహన్​ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

'నేను ఆదివారం వేరే ఊరికి వెళ్లాను. ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చాను. అప్పుడు ఇంటి తలుపులు లోపల నుంచి తాళం వేసి ఉన్నాయి. ఎంత పిలిచినా తలుపులు తీయలేదు. దీంతో చుట్టుపక్కల వారి సహాయంతో తలుపులు విరగొట్టి లోపలికి వెళ్లా. ఒక్కసారికి షాక్​కు గురయ్యా. నా కోడలు, మనవరాలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. నా కుమారుడు కూడా విగతజీవిగా కనిపించాడు.' అని మృతుడు మోహన్​ తండ్రి శ్యామపాల్​ తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని.. పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

అడ్వటైజ్​మెంట్​ డిస్​ప్లే బోర్డు హ్యాక్​.. ప్రకటనలకు బదులు పోర్న్​ వీడియోలు
రైల్వే జంక్షన్​లోని అడ్వటైజ్​మెంట్​ డిస్​ప్లే బోర్డును.. సైబర్​ నేరగాళ్లు హ్యాక్​ చేశారు. అందులో కాసేపు పోర్న్​ వీడియోలు ప్రదర్శించారు. బిహార్​ రాజధాని పట్నా రైల్వే స్టేషన్​లో ఈ ఘటన జరిగింది. దీంతో ప్రయాణికులంతా కాసేపు ఇబ్బంది పడ్డారు. ఆదివారం రాత్రి 9.30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.

దాదాపు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు అడ్వటైజ్​మెంట్​ డిస్​ప్లే బోర్డుపై పోర్న్​ వీడియోలు ప్లే అయ్యాయని రైల్వే పోలీసులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే సిబ్బంది.. డిస్లే బోర్డ్​ను ఆఫ్​ చేసినట్లు వారు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. హోలి ముందు రోజు కూడా ఇలాంటి ఘటన జరిగినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా అడ్వటైజ్​మెంట్​ డిస్​ప్లే బోర్డుపై.. ప్రకటనలకు బదులు పోర్న్​ వీడియోలు ప్లే కావడంపై రైలు ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సైబర్​ నేరగాళ్లు ఈ అసభ్యకర ఘటనలకు పాల్పడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని మండిపడుతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.