ETV Bharat / bharat

భార్యాబిడ్డపై పెట్రోల్​ పోసి నిప్పంటించిన భర్త.. ఇద్దరు చిన్నారులు సహా నలుగురు మృతి - కుటుంబ సభ్యులపై పెట్రోల్​ పోసి చంపిన వ్యక్తి

భార్యపై కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులపై పెట్రోల్​ పోసి నిప్పు అంటించాడు. ఘటనలో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడు సైతం చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో మహిళ సైతం చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

man-killed-family-members-in-tamil-nadu-by-pouring-petrol
కుటుంబ సభ్యులపై పెట్రోల్​ పోసి చంపిన వ్యక్తి
author img

By

Published : Feb 8, 2023, 10:29 PM IST

తమిళనాడు కడలూరు జిల్లాలో ఘోరం జరిగింది. భార్యపై కోపంతో ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులపై పెట్రోల్​ పోసి నిప్పు అంటించాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందాడు. మరో మహిళ చికిత్స సైతం పొందుతూ మృతి చెందింది. మృతుడి భార్య, అమ్మ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చెల్లంగుప్పంలోని వెల్లిపిల్లయార్ కోయిల్ స్ట్రీట్ బుధవారం ఈ దారుణం జరిగింది. మృతులను తమిళరాసి, నాలుగు, ఎనిమిది నెలల చిన్నారులుగా పోలీసులు గుర్తించారు. ధనలక్ష్మి, సద్గురు భార్యాభర్తలు. వీరిద్దరికి కొన్ని రోజులు క్రితం ఇంట్లో గొడవ జరిగింది. దీంతో ధనలక్ష్మి తన నాలుగు నెలల చిన్నారితో కలిసి.. అక్క తమిళరాసి ఇంటికి వచ్చింది. తమిళరాసికి కూడా ఓ ఎనిమిది నెలల చిన్నారి ఉంది.

బుధవారం భార్యను చంపాలనే ఉద్దేశంతో పెట్రోల్​ క్యాన్​తో తమిళరాసి ఇంటికి వచ్చాడు సద్గురు. భార్య ధనలక్ష్మి, తన నాలుగు నెలల చిన్నారిపై పెట్రోల్​ పోశాడు. చెల్లిని కాపాడేందుకు వెళ్లిన తమిళరాసిపైనా ఆమె ఎనిమిదేళ్ల చిన్నారిపైన కూడా పెట్రోల్​ పోశాడు. అక్కడే ఉన్న అతడి తల్లిపైనా నిందితుడి పెట్రోల్ పోశాడు. అనంతరం తాను కూడా పెట్రోల్​ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఘటనలో అందరూ తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. నిందితుడు, తమిళరాసి చికిత్స పొందుతూ మృతి చెందారు. 90 శాతం కాలిన గాయాలతో ధనలక్ష్మి, సెల్వి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గుడిసె కాలి ముగ్గురు చిన్నారులు మృతి..
రాజస్థాన్​లో ఈ విషాదం జరిగింది. గుడిసె కాలిపోయి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. జైపుర్​ జిల్లా నాగనా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాంద్రా గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతులను రుక్మ (7), సరూపి (4) అశోక్ సింగ్ (2)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపరీక్షల నిమ్మిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాటిని వారి కుటుంబ సభ్యులకు అందించారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.