ఝార్ఖండ్ దుమ్కాలో తరహాలోనే గఢ్వాలో కూడా పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన జరిగింది. శ్రీబంశీధర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిత్తవిశ్రామ్లో గ్రామంలో.. ఒక వృద్ధుడు యువకుడిని సజీవ దహనం చేసే ప్రయత్నం చేశాడు. పరిస్థితి విషమించిన యువకుడు దీపక్ సోనీని(37) గఢ్వాలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఈ ఘటన జరిగింది.
కసముద్దీన్ అన్సారీ అనే వ్యక్తితో సోనీకి.. మద్యం విషయంలో గొడవ జరిగినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు భయపడి.. ఉత్తర్‌ప్రదేశ్ ఉన్నావ్ జిల్లా బాంగర్మౌ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులకు భయపడి రాజేశ్ అనే వ్యక్తి తన మెడను తానే కోసుకున్నాడు. గాయపడిన అతడిని స్థానికులు ఆస్పత్రిలో చేర్పించారు. రాజేశ్, అతడి భార్య మధ్య గొడవ అయిందని.. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిందని బంధువులు చెప్పారు. తనను అరెస్టు చేశారన్న భయంతోనే రాజేశ్ ఇలా చేసినట్లు చెబుతున్నారు.
పాత శత్రుత్వంతో కత్తితో పొడిచి.. ఓ యువకుడిని కత్తితో పొడిచి చంపారు దుండగులు. ఈ ఘటన కేరళ కొచ్చి జిల్లా కలూర్ సమీపంలో శనివారం ఉదయం జరిగింది. రెండు వర్గాల మధ్య పాత శత్రుత్వంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు చెప్పారు.
గతంలో ఫేస్బుక్లో రెచ్చగొట్టే పోస్ట్ పెట్టినందుకు కిరణ్ ఆంటోనీ అనే వ్యక్తిని ప్రశ్నించడానికి.. అతడి ఇంటికి తన గ్రూప్‌తో బయల్దేరాడు సజ్జన్. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. గొడవ తీవ్రమవగా.. సజ్జన్ చనిపోయాడు. ఆంటోనీ సహా పలువురికి గాయాలయ్యాయి. సజ్జన్ హత్యతో ఆంటోనీని కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు.
రెండో తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం.. రెండో తరగతి చదివే ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు 25 ఏళ్ల వ్యక్తి. ఉత్తర్‌ప్రదేశ్ నగ్రాలో సెప్టెంబర్ 5న ఈ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను ప్రలోభపెట్టిన నిందితుడు.. తన ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసులు చెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు యువకుడిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. మహారాష్ట్ర జల్నాలో దివ్యాంగ మహిళపై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బద్నాపుర్ తాలుకా దభాడీ గ్రామంలో ఆగస్టు 28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముగ్గురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన పూజారి.. దేవుడికి పెట్టిన నైవేద్యం(బాదం పప్పులు) దొంగలించాడన్న కారణంతో.. 11 ఏళ్ల బాలుడిని చెట్టుకు కట్టేసి కొట్టాడు ఓ ఆలయ అర్చకుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలో జరిగింది. సంబంధిత వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. బాధితుడి తండ్రి ఫిర్యాదు మేరకు జైన దేవాలయం పూజారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే.. ఇప్పటివరకు అరెస్టు చేయలేదు.
ఇవీ చూడండి : ఫుడ్ డెలివరీ బాయ్ మర్మాంగంపై కుక్క కాటు.. లిఫ్ట్ నుంచి బయటకు వస్తుండగా..