ETV Bharat / bharat

రాష్ట్రపతి ఎన్నికలపై 15న విపక్షాల భేటీ.. ఆ సీఎంలకు దీదీ లేఖ - విపక్షాల భేటీ

రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏ కూటమి అభ్యర్థిని ఓడించేందుకు విపక్షాలు కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. ఈ మేరకు ఈనెల 15న దిల్లీలో సమావేశం ఏర్పాటు చేశారు బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు భేటీకి హాజరుకావాలని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు.

MAMATA
బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
author img

By

Published : Jun 11, 2022, 5:29 PM IST

రాష్ట్రపతి ఎన్నికల నగారా మోగిన క్రమంలో దేశంలో రాజకీయాలు మరోమారు వేడెక్కాయి. అధికార ఎన్​డీఏ పక్షాన్ని నిలువరించేందుకు బలమైన అభ్యర్థిని బరిలో నిలిపేందుకు పలు విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు బంగాల్​ సీఎం మమతా బెనర్జీ. రాష్ట్రపతి ఎన్నికలకు సంయుక్త వ్యూహాన్ని రూపొందించేందుకు జూన్​ 15న దిల్లీలో నిర్వహించే సమావేశానికి హాజరుకావాలని కోరారు.

" 2022, జూన్​ 15న మధ్యాహ్నం 3గంటలకు దిల్లీలోని కాన్​స్టిట్యూషన్​ క్లబ్​లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేసేందుకు ఈ భేటీకి హాజరుకావాలని మమత పిలుపునిచ్చారు. బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలనే లక్ష్యంతో విపక్ష నేతలు, ముఖ్యమంత్రులతో దీదీ సమావేశమవుతారు. "

- తృణమూల్​ కాంగ్రెస్​.

ఈ మేరకు 22 మంది విపక్ష నేతలు, ముఖ్యమంత్రులకు లేఖ రాశారు మమత. అందులో ముఖ్యమంత్రులు.. అరవింద్​ కేజ్రీవాల్​, పినరయి విజయన్​, నవీన్​ పట్నాయక్​, కేసీఆర్​, ఎంకే స్టాలిన్​, ఉద్ధవ్​ ఠాక్రే, హేమంత్​ సొరెన్​, భగవంత్​ మాన్​లు ఉన్నారు. వారితో పాటు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సైతం ఆహ్వాన లేఖను పంపించారు మమత.
రాష్ట్రపతి ఎన్నికలపై ఇటీవల ప్రకటన చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జులై 18న పోలింగ్​ నిర్వహిస్తారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఎలక్టోరల్​ కాలేజీలో ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఉన్నారు. వారి ఓటు విలువ దాదాపు సమానంగానే ఉంది.

ఇదీ చూడండి: జులై 18న రాష్ట్రపతి ఎన్నిక.. 21న ఓట్ల లెక్కింపు

రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా.. ఈ విషయాలు తెలుసా?

రాష్ట్రపతి అభ్యర్థుల రేసులో పలువురు గవర్నర్లు.. తమిళిసై కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.