ETV Bharat / bharat

మకర మేళాలో విషాదం.. తొక్కిసలాట జరిగి ఒకరు మృతి.. చిన్నారులు సహా 20 మందికి గాయాలు - మకర మేళాలో తొక్కిసలాట

ఒడిశా కటక్​లో విషాదం నెలకొంది. గోపీనాథ్​పుర్​-బదంబా వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Makar Mela Stampede on Bridge
Makar Mela Stampede on Bridge
author img

By

Published : Jan 14, 2023, 7:25 PM IST

Updated : Jan 14, 2023, 10:43 PM IST

మకర మేళాలో విషాదం

ఒడిశా కటక్​లో విషాదం నెలకొంది. గోపీనాథ్​పుర్​-బదంబా వంతెనపై తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఒక మహిళ మరణించగా.. 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో అనేక మంది చిన్నారులు, మహిళలు ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని కటక్​లోని ఎస్​సీబీ మెడికల్​ ఆసుపత్రిలో చేర్పించినట్లు వారు వెల్లడించారు. మృతురాలిని 45 ఏళ్ల అంజనగా గుర్తించారు. ప్రమాదంపై స్పందించిన ముఖ్యమంత్రి నవీన్​ పట్నాయక్​.. మృతురాలి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మకర సంక్రాంతిని పురస్కరించుకుని సింగనాథ్​ ఆలయంలో జరుగుతున్న మకర మేళా కోసం అనేక మంది భక్తులు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే వంతెనపై ప్రజల తాకిడి అధికమైంది. కొవిడ్​ కారణంగా రెండేళ్ల విరామం తర్వాత ఈ వేడుకలు జరగడం వల్ల భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని.. ఒక్కసారిగా వంతెనపైకి రావడమే కారణమని సబ్​ కలెక్టర్​ హేమంత్ కుమార్​ తెలిపారు. కటక్​, పూరి, దెంకనాల్​ తదితర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని అధికారును ఆదేశించారు కటక్ కలెక్టర్ భబానీ శంకర్ చైనీ. మకర మేళా జరుగుతున్న సింగనాథ్​ ఆలయ సమీపంలో 144 సెక్షన్​ విధించాలని ఆయన అధికారులకు సూచించారు.

Last Updated : Jan 14, 2023, 10:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.