ETV Bharat / bharat

చేతబడి పేరుతో ఊరంతా ఏకమై.. ఏడుగురిపై దాడి - చేతబడి

మూఢనమ్మకాల పేరుతో క్రూరత్వాన్ని ప్రదర్శించారు ఓ గ్రామస్థులు. చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఏడుగురిని గుంజకు కట్టి.. కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామంలో శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

witchcraft incident
చేతబడి పేరుతో దాడి
author img

By

Published : Aug 23, 2021, 1:28 PM IST

చేతబడి పేరుతో ఏడుగురిపై దాడి చేసిన గ్రామస్థులు

చేతబడి చేస్తున్నారనే అనుమానంతో అత్యంత దారుణంగా ఏడుగురిని కట్టేసి కొట్టారు ఓ గ్రామ ప్రజలు. ఈ ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహారాష్ట్రలోని చంద్రాపుర్​ జిల్లా జివిటి తాలూకాలోని వానిబుడ్రక్​ గ్రామంలో శనివారం జరిగిందీ ఘటన.

beaten on suspicion of witchcraft
గుంజకు కట్టేసిన వృద్ధుడు

పోలీసుల రాకతో..

వానిబుడ్రక్​ మహారాష్ట్రలోని ఓ మారుమూల గ్రామం. ఆ ఊరిలో ఏడుగురు వ్యక్తులు చేతబడి చేస్తున్నారని గ్రామస్థులు ఎప్పటినుంచో అనుమానిస్తున్నారు. దీంతో ఊరంతా ఏకమై అనుమానితులను గుంజకు కట్టేసి.. చితకబాదారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను విడిపించారు. వీరిలో ఇద్దరు వృద్ధులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను చంద్రాపుర్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

beaten on suspicion of witchcraft
గుంజకు కట్టి ఉన్న వృద్ధురాలు
beaten on suspicion of witchcraft
గుంజకు కట్టి ఉన్న మహిళ

ఈ ఘటన అనంతరం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో భారీ సంఖ్యలో పోలీసు సిబ్బందిని మోహరించారు అధికారులు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. 13 మందిని అరెస్టు చేశారు. దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:'చెల్లెలి కొడుకే అమ్మకు ఇష్టం.. అందుకే చంపేశా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.