ఓ మహిళను రెండేళ్ల పాటు నిర్బంధ గృహంలో ఉంచాలన్న మేజిస్ట్రేట్ కోర్టు తీర్పును సమర్థించింది ముంబయి సెషన్స్ కోర్టు(Mumbai latest news). హెచ్ఐవీ (HIV positive sex worker) సోకిన ఆమెతో సమాజానికి ప్రమాదమని వ్యాఖ్యానించింది. అసలేమైందంటే?
సదరు యువతిని ఆగస్టులో అరెస్టు చేశారు పోలీసులు. నటి కూడా అయిన ఆమె వ్యభిచారం చేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ఆమెను రెండేళ్ల పాటు నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. వ్యాధి ఇతరులకు సోకే ప్రమాదం ఉందని తెలిపింది.
దీనిపై ఆ యువతి తండ్రి సెషన్స్ కోర్టులో(Mumbai sessions court) సవాల్ చేశారు. హెచ్ఐవీ సోకిందన్న ఒక్క కారణంతోనే(HIV positive sex worker) తన కూతుర్ని నిర్బంధంలో ఉంచారని చూస్తున్నారని అప్పీల్లో పేర్కొన్నారు. చిన్న తప్పిదంతోనే.. మానవ అక్రమ రవాణా(నిరోధక) చట్టం కింద అరెస్టు చేశారని తెలిపారు. పోలీస్ అధికారి కూడా అయిన బాధితురాలి తండ్రి.. ఆమెను నిర్బంధంలో ఉంచాల్సిన అవసరం ఏముందని, కూతుర్ని చూసుకునే ఆర్థిక స్తోమత తమకు ఉందని అప్పీల్లో తెలిపారు. బాధితులకు ఇష్టం లేకుండా నిర్బంధంలో ఉంచరాదని.. బాంబే హైకోర్టు(Mumbai latest news) గతంలో ఓ మహిళ విషయంలో ఇచ్చిన తీర్పును కూడా తన పిటిషన్లో ఉదహరించారు.
ఏదేమైనా.. ఎఫ్ఐఆర్ ప్రకారం ఆ మహిళను వ్యభిచారం(HIV positive sex worker) నుంచి రక్షించారని, నిర్బంధం తప్పదని సెషన్స్ కోర్టు బదులిచ్చింది. అందుకే దిగువ కోర్టు తీర్పులో జోక్యం చేసుకోదలుచుకోలేమని.. అప్పీల్‌ను తిరస్కరించింది.
''బాధితురాలు హెచ్ఐవీతో(HIV positive sex worker) బాధపడుతోంది. లైంగిక సంపర్కం ద్వారా.. ఇది ఇతరులకు సోకే ప్రమాదం ఉంటుంది. ఇది సమాజానికి మంచిది కాదు. ఆమెను నిర్బంధంలో ఉంచి.. రక్షణ కల్పించడం ద్వారా మళ్లీ సాధారణ స్థితికి చేరుకొనే అవకాశం ఉంటుంది. మనసు కూడా మారుతుంది.''
- సెషన్స్ కోర్టు
ఇదీ చూడండి: మాజీ ప్రేయసిపై అత్యాచారం.. అలా చేస్తే తననే పెళ్లాడుతుందని...