ETV Bharat / bharat

లారీ బ్రేక్స్ ఫెయిల్.. పెను ప్రమాదంలో 10 మంది మృతి - మహారాష్ట్ర లేటెస్ట్ న్యూస్

Maharashtra accident news : మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికి గాయాలయ్యాయి.

maharashtra accident news
maharashtra accident news
author img

By

Published : Jul 4, 2023, 1:20 PM IST

Updated : Jul 4, 2023, 9:43 PM IST

Maharashtra accident news : మహారాష్ట్రలోని ధూలె జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది మరణించారు. లోడుతో వెళ్తున్న ఓ లారీ.. ఓ కారు సహా పలు వాహనాలను ఢీకొట్టింది. ఆ తర్వాత రోడ్డు పక్కనే ఉన్న హోటల్​లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి గాయాలయ్యాయి. ముంబయి- ఆగ్రా హైవేపై మహారాష్ట్ర-మధ్యప్రదేశ్ సరిహద్దులో ఉన్న పలసనేర్ ప్రాంతంలో ఉదయం 10.45 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను శిర్పూర్ కాటేజ్ ఆస్పత్రికి తరలించారు.

maharashtra accident news
ఘోర ప్రమాదం
maharashtra-accident-news
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశం

నాలుగుకు పైగా వాహనాలు అనూహ్య రీతిలో ప్రమాదానికి గురయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అధికారుల వివరాల ప్రకారం.. నర్మదా ఎంఐడీసీలోని వండర్ సిమెంట్ కంపెనీ కోసం ఓ లారీ గులకరాళ్ల లోడుతో వెళ్తోంది. వేగంగా వెళ్తున్న ఆ లారీ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ అయ్యాయి. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. ఫలితంగా రెండు ద్విచక్రవాహనాలతో పాటు ఓ కారును, మరో కంటైనర్​ను వెనక నుంచి లారీ ఢీకొట్టింది. ఆ తర్వాత హైవేపై బస్టాప్ సమీపంలో ఉన్న హోటల్​లోకి దూసుకెళ్లింది. బాధితుల్లో కొందరు బస్టాప్ వద్ద ఎదురుచూస్తున్నవారు సైతం ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన లారీ మధ్యప్రదేశ్​ నుంచి ధూలెకు వెళ్తోందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అప్రమత్తమయ్యారని.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారని వివరించారు.

maharashtra accident news
ఘోర ప్రమాదం
maharashtra-accident-news
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశం
maharashtra-accident-news
రోడ్డు ప్రమాదం జరిగిన ప్రదేశం

ప్రధాని మోదీ స్పందన..
మహారాష్ట్ర ధూలె రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రుల కుటుంబానికి రూ.50 వేలు ఎక్స్​గ్రేషియా ప్రకటించారు.

  • The accident in Dhule, Maharashtra is saddening. Condolences to the bereaved families. Prayers with the injured for a quick recovery. An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi

    — PMO India (@PMOIndia) July 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Maharashtra bus accident : మహారాష్ట్రలో నాలుగు రోజుల క్రితం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 26 మంది మరణించారు. మరో ఏడుగురు గాయపడ్డారు. బుల్దానాలో జిల్లాలోని సిండ్​ఖేడ్​రాజా ప్రాంతంలో సమృద్ధి మార్గ్ ఎక్స్​ప్రెస్​వేపై జులై​ 1న ఈ ఘటన జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నాగ్​పుర్​​ నుంచి పుణెకు 33 మందితో వెళ్తోంది. ఒక్కసారిగా టైరు పేలడం వల్ల వాహనం అదుపు తప్పింది. పక్కన ఉన్న స్తంభాన్ని, ఆ తర్వాత డివైడర్​ను ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే 26 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

Last Updated : Jul 4, 2023, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.