ETV Bharat / bharat

'భాజపాకు ఓటు వేయలేదని ఎస్​సీ బాలిక స్కూల్​కు రాకుండా అడ్డగింత!' - మద్యప్రదేశ్​ లేటెస్ట్​ అప్డేట్స్​

పంచాయతీ ఎన్నికల్లో తల్లిదండ్రులు ఓటు వేసి మద్దతు ఇవ్వలేదని ఓ బాలికను స్కూల్​కు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Dalit girl allegedly stopped from attending school for not voting
dalit girl expelled from school
author img

By

Published : Nov 4, 2022, 10:11 AM IST

పంచాయతీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓ బాలిక తల్లిదండ్రులు ఓటు వేసి మద్దతు ఇవ్వలేదని ఆగ్రహించిన స్కూల్​ యాజమాన్యం.. ఓ ఎస్​సీ విద్యార్థిని పాఠశాలకు రానివ్వకుండా అడ్డుకుంది. ఈ విషయమై బాలిక తండ్రి ఎంత తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్​లోని షాజాపుర్​లో జరిగింది.

షాజాపుర్​లోని ఓ దళిత బాలికకు విద్యా హక్కు చట్టం కింద స్థానిక ప్రైవేట్​ స్కూల్​లో అడ్మిషన్​ ఇచ్చారు. ఆ స్కూల్​ డైరక్టర్ రవి పటీదార్ అనే వ్యక్తి ఇంటి నుంచి​​ ఆయన వదిన అయిన సప్నా సచిన్​ పటీదార్ భాజపా తరఫున​ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. అయితే బాలిక నివసిస్తున్న ప్రాంతం నుంచి ఆమెకు ఒక్క ఓటూ పడలేదు.

బాలిక తల్లిదండ్రులు సప్నాకు ఓటు వేయలేదని ఆగ్రహించిన డైరక్టర్​ మరుసటి రోజు బాలికను స్కూల్​ వద్ద అడ్డుకున్నారు. ఇక తనను స్కూల్​కు రానివ్వమని అన్నారు. ఈ విషయంపై జిల్లా విద్యాశాఖ అధికారులతో పాటు సీఎం హెల్ప్​లైన్​కు కూడా ఫిర్యాదు చేశారు. కాని ఎవరూ స్పందించలేదు.

ఇదీ చదవండి:విశాఖ రుషికొండ లెక్కతేల్చేందుకు రంగంలోకి కేంద్రం

మేక రూపురేఖలతో పుట్టిన కుక్కపిల్ల.. చూసేందుకు తరలివస్తున్న జనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.