Madhya Pradesh Assembly Election 2023 Counting : మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 52 కేంద్రాల్లో ఓట్లు లెక్కించేందుకు ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుందని, అరగంట తర్వాత ఈవీఎంలలో ఓట్లను లెక్కిస్తామని మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారి అనుపమ్ రాజన్ తెలిపారు.
52 కేంద్రాల్లో కౌంటింగ్- 144 సెక్షన్ అమలు
మధ్యప్రదేశ్‌లోని మొత్తం 52 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కౌంటింగ్ జరుగుతుందని అనుపమ్ రాజన్ వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఎక్కువగా ఉంటే పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం లెక్కింపు సమాంతరంగా కొనసాగుతుందని వివరించారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని మధ్యప్రదేశ్ పోలీసులు తెలిపారు. కేంద్రాల సమీపంలో ఎలాంటి ఊరేగింపులు చేయవద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
-
VIDEO | Preparations in full swing in Bhopal ahead of the counting of votes on Sunday. #MadhyaPradeshElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/K7Vqa8kpnE
">VIDEO | Preparations in full swing in Bhopal ahead of the counting of votes on Sunday. #MadhyaPradeshElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/K7Vqa8kpnEVIDEO | Preparations in full swing in Bhopal ahead of the counting of votes on Sunday. #MadhyaPradeshElections2023 #AssemblyElectionsWithPTI
— Press Trust of India (@PTI_News) December 2, 2023
(Full video is available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/K7Vqa8kpnE
బీజేపీX కాంగ్రెస్
Madhya Pradesh Election 2023 : మధ్యప్రదేశ్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 230 కాగా, మెజార్టీ మార్క్-116. అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్యే ప్రధాన పోరు నెలకొంది. నవంబర్ 17వ తేదీన ఒకే విడతలో జరిగిన పోలింగ్‌లో 76.22 శాతం పోలింగ్ నమోదైంది. 956లో రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం. 2018లో జరిగిన ఎన్నికల్లో 75.63 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఆదివారం జరిగే ఓట్ల లెక్కింపులో ఎవరికివారు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఎగ్జిట్ పోల్స్ ఇలా
మధ్యప్రదేశ్‌లో మళ్లీ బీజేపీకే అధికారం రావచ్చని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేస్తున్నాయి. మరికొన్ని మాత్రం కాంగ్రెస్ అధికారం దక్కించుకోవచ్చని అంటున్నాయి. అంటే మధ్యప్రదేశ్‌లో అధికార బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య హోరాహోరీ పోటీ ఉంటుందని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం వల్ల కాంగ్రెస్ సర్కారు కుప్పకూలింది. దీంతో శివరాజ్‌సింగ్ చౌహాన్ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
కమల్‌నాథ్ కంచుకోటలో పాగాకు బీజేపీ ప్లాన్.. దేవుని విగ్రహాల చుట్టూ రాజకీయం!
కర్ణాటక నేర్పిన పాఠం- '75ఏళ్ల రూల్' బ్రేక్- ఎంపీలో బీజేపీ భారమంతా వృద్ధనేతలపైనే!