విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఓ ప్రేమజంట.. చోరీల బాటపట్టింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చే వీరు.. యాజమానుల దృష్టిని మరల్చి.. ఆ ఇంట్లోని వస్తువులను దొంగిలించేవారు. కర్ణాటక బెంగళూరులో గతకొంత కాలంగా జరుగుతున్న ఈ తరహా దొంగతనాల కేసును పోలీసులు ఛేదించారు.
ఇదీ వీరి కథ..
అద్దెకు ఇల్లు కావాలని వస్తూ చోరీలు చేసే ప్రేమజంటను వినయ్, కీర్తనగా పోలీసులు గుర్తించారు. వీరిద్దరికీ మూడేళ్ల క్రితం పరిచయమైంది. వినయ్‌పై ఇప్పటికే రౌడీషీట్ ఉందని, ఓ హత్య సహా.. పలు క్రిమినల్ కేసుల్లో అతను నిందితుడని తెలిపారు. అయితే వినయ్ రౌడీషీటర్ అని తెలిసినప్పటికీ.. అతడిని ప్రేమిస్తున్నట్లు పోలీసులకు వెల్లడించింది కీర్తన. అతని కోసం ఏమైనా చేస్తానని.. జైలుకు కూడా వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతోంది.
ప్రస్తుతం వినయ్-కీర్తనలు ప్రేమలో ఉన్నారని.. తనను లాంగ్‌డ్రైవ్‌కు తీసుకెళ్లాలని, ఖరీదైన బహుమతులు ఇవ్వాలని కీర్తన వినయ్‌ని ఒత్తిడి చేసేదని పోలీసుల విచారణలో వెల్లడైంది. అందుకే దొంగతనాలు చేసేవాడని .. వీటికోసం ఆమెనూ తీసుకువెళ్లేవాడని తేలింది.
దొరికారిలా..
ఈ క్రమంలోనే అక్టోబర్ 4న మారుతీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లిన ఈ జంట.. ప్రైవేట్ కంపెనీ ఉద్యోగులుగా పరిచయం చేసుకొని ఇల్లు అద్దెకు కావాలని నాటకం ఆడారు. అనంతరం యజమాని దృష్టిని మరల్చి ఒక మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్, రూ.15 వేల నగదును దొంగిలించారు.
తమ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యజమాని ఇంటి అద్దెకోసం వచ్చిన జంట దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించి.. చంద్ర లేఅవుట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రేమజంటను అరెస్ట్ చేశారు.
ఇవీ చదవండి: