ETV Bharat / bharat

Leopard Trapped in Cage at Tirumala: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. మరో ఐదు సంచారం..

Leopard_Trapped_in_Cage_at_Tirumala
Leopard_Trapped_in_Cage_at_Tirumala
author img

By

Published : Aug 14, 2023, 6:52 AM IST

Updated : Aug 14, 2023, 12:26 PM IST

06:42 August 14

ఇటీవల చిన్నారిని బలితీసుకున్న చిరుత

Leopard Trapped in Cage at Tirumala: తిరుమలలో బోనులో చిక్కిన చిరుత.. ఇటీవలే దాడిలో చిన్నారి బలి

Leopard Trapped in Cage at Tirumala: తిరుమలలో అటవీశాఖ అధికారుల చేతికి చిరుత పులి చిక్కింది. ఇటీవల అలిపిరి కాలినడక మార్గంలో చిరుత ఆరేళ్ల చిన్నారిని బలి తీసుకోగా.. అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు దానిని పట్టుకునేందుకు.. చిన్నారిపై దాడి చేసిన నరసింహస్వామి ఆలయం వద్ద 3 బోన్లను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా ట్రాప్​ కెమెరాలూ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో బోనులో ఓ చిరుత చిక్కింది.

మరో ఐదు చిరుతల సంచారం: చిన్నారి మృతిపై అప్రమత్తమైన అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్​ కెమెరాలలో ఐదు చిరుతలు సంచరిస్తున్న దృశ్యాలు నమోదయ్యాయి. తిరుమల ఏడో మైలు, నామాలగవి, లక్ష్మీనరసింహస్వామి ఆలయం పరిసరాల్లో చిరుతలు సంచరిస్తున్నట్లుగా ఆ దృశ్యాల్లో నమోదయ్యాయి. భక్తులకు చిరుతల నుంచి రక్షణ కోసం టీటీడీ, అటవీశాఖ ఉన్నతాధికారులు.. తిరుమల అన్నమయ్య భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు సమీక్షించనున్నారు. ఈ సమావేశంలో అటవీశాఖ సీసీఎఫ్‌, టీటీడీ ఛైర్మన్‌, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.

ఆరేళ్ల బాలికపై చిరుత దాడి.. 200 మీటర్లు ఈడ్చుకెళ్లి..

బోనులో చిక్కిన చిరుతను ఎస్వీ జూపార్కుకు తరలించనున్నట్లు టీటీడీ ఆలయాధికారులు తెలిపారు. దానిని పట్టుకునేందుకు ఏర్పాటు చేసిన బోనులో చిక్కే క్రమంలో చిరుత స్వల్పంగా గాయపడినట్లు వివరించారు. ఎస్వీ జూపార్కుకు తరలించిన అనంతరం చిరుతకు చికిత్స అందిచనున్నట్లు వెల్లడించారు. అయితే పట్టుబడిన చిరుత మ్యాన్‌ ఈటర్‌ అవునా కాదా అనేదానిపై పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ పరీక్షలన్నీ ముగిసిన తర్వాత చిరుతను ఎక్కడ వదిలిపెట్టాలనే అంశంపై సమీక్షించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు.

"నడక మార్గల్లో భక్తులకు ఇబ్బంది కలగకుండా, కృూర మృగాల నుంచి రక్షించే విధంగా.. అటవీశాఖను కోరి అందుకు తగిన సదుపాయలు, సిబ్బందిని మేము అందిస్తాము. ఇది టీటీడీ చేసే పని కాదు. ఇది రిజార్వుడు ఫారెస్టు. దీని భాద్యతలు అటవీశాఖ తీసుకోవాలని కోరుతున్నాము." -ధర్మారెడ్డి, టీటీడీ ఈవో

Animals Attack on Devotees in Tirupati: వెంకన్న దర్శనం.. అధికారుల నిర్లక్ష్యం.. భక్తులకు ప్రాణసంకటం..!

అప్రమత్తమైన అధికారులు : చిరుత దాడిలో చిన్నారి బలికావటంతో టీటీడీ అధికారులు, భద్రత సిబ్బంది, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. సాయంత్రం చీకటి పడ్డ తర్వాత అలిపిరి, శ్రీవారి కాలినడక మార్గాల్లో భక్తులను అనుమతించే అంశంపై చర్చించారు. నడకమార్గం ద్వారా 15సంవత్సరాల లోపు పిల్లలకు మధ్యహ్నం 2గంటలు దాటిన తర్వాత అనుమతి నిషేదించారు. అంతేకాకుండా ఏడో మైలు వద్ద చిన్నపిల్లల చేతికి ట్యాగ్​లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో చిన్నారుల తల్లిదండ్రుల వివరాలు, ఊరు, ఫోన్​ నెంబర్, భద్రత సిబ్బంది టోల్​ప్రీ నెంబర్​​ వంటి తదితర వివరాలుంటాయి.

TTD EO Inspection: అలిపిరి నడక మార్గంలో జాగ్రత్త.. భక్తులకు టీటీడీ సూచనలు

చిన్నారిపై దాడి ఇలా: నెల్లూరు జిల్లా పోతిరెడ్డిపాలెం నుంచి శ్రీవారి దర్శనానికని బయల్దేరిన దినేష్​ కుటుంబం.. సుమారు రాత్రి 8 గంటల ప్రాంతంలో అలిపిరి నుంచి కాలినడకన బయల్దేరారు. రాత్రి పదిన్నర సమయంలో కాలినడక మార్గంలోని లక్ష్మినరసింహ స్వామి ఆలయ సమీపానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులందరికంటే ముందుగా చిన్నారి నడుస్తోన్న చిన్నారి.. లక్ష్మినరసింహ స్వామి ఆలయ సమీపానికి రాగానే కనిపించకుండాపోయింది. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆలయ ప్రాంగాణంలో వెతకసాగారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న భద్రత సిబ్బందికి ఫిర్యాదు చేశారు. రాత్రి సమయంలో గాలింపు చర్యలకు వీలుకాక.. భద్రత సిబ్బంది ఉదయాన్నే గాలింపు చేపట్టింది. ఉదయం ఏడు గంటల సయయంలో అటవీ శాఖ అధికారులకు.. సగం తిన్న స్థితిలో చిన్నారి మృతదేహం లభ్యమైంది.

Cheetah Attack Boy Discharge: చిరుత దాడిలో గాయపడిన బాలుడు డిశ్చార్జ్

Last Updated : Aug 14, 2023, 12:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.