ETV Bharat / bharat

మైనర్​పై​ అత్యాచారం.. పోలీసు స్టేషన్​ గదిలోకి తీసుకెళ్లి.. - లలిత్​పుర్ మైనర్​ రేప్

lalitpur minor rape: మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుగురు వ్యక్తులు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని లలిత్​పుర్​లో జరిగింది. నిందితుల్లో పోలీసు ఇన్​స్పెక్టర్ కూడా ఉన్నాడు.

lalitpur minor rape
మైనర్ రేప్
author img

By

Published : May 4, 2022, 1:53 PM IST

Updated : May 4, 2022, 2:42 PM IST

Lalitpur minor rape: ఉత్తర్​ ప్రదేశ్​లోని లలిత్​పుర్​ జిల్లాలో దారుణం జరిగింది.​ బాలికపై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో పోలీస్​​ ఇన్​స్పెక్టర్ ఉన్నాడు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు. ఏప్రిల్ 22వ తేదీన మైనర్ బాలికను భోపాల్​ తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అసలేం జరిగిందంటే: పాలీ రైల్వే స్టేషన్ సమీపంలోనే బాధితురాలిని ఉంచిన ముగ్గురు నిందితులు వరుసగా మూడు రోజులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాధితురాలిని పాలీ పోలీస్​ స్టేషన్ సమీపంలో ఏప్రిల్ 26న వదిలి వెళ్లిపోయారు. బాధితురాలిని వాంగ్మూలం తీసుకున్న పాలీ పోలీసులు.. బాలికను ఆమె అత్తతో పంపించేశారు.

ఏప్రిల్ 27వ తేదీన బాధితురాలిని వాంగ్మూలం నిమిత్తం పోలీస్​ స్టేషన్​కు పిలిచారు పాలీ ఇన్​స్పెక్టర్. ఆరోజు సాయంత్రం స్టేషన్​లోని ఓ గదిలోనే ఇన్​స్పెక్టర్ బాధితురాలిపై అత్యాచారం చేశాడు. అనంతరం బాధితురాలిని ఆమె అత్తకు అప్పగించాడు.

ఏప్రిల్ 30న చైల్డ్ లైన్‌కు బాధితురాలిని అప్పగించారు కుటుంబ సభ్యులు. బాలికకు కౌన్సెలింగ్‌ ఇవ్వగా.. జరిగిన దారుణమంతా చెప్పింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులందరిపై కేసు నమోదు చేయాలని జిల్లా ఎస్పీ పోలీసులను ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు చందన్‌, రాజ్‌భాన్‌, హరిశంకర్‌, మహేంద్ర చౌరాసియా, ఇన్‌స్పెక్టర్‌ తిలక్‌ధారి సరోజ్‌, గులాబ్బాయి అహిర్వార్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

వివాహితపై దారుణం: వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు కామాంధులు. అనంతరం ఆమెను కత్తితో కడుపులో పొడిచేశారు. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటన హరియాణాలోని గురుగ్రామ్​లో సోమవారం జరిగింది.

గురుగ్రామ్​లోని నాథాపుర్ సమీపంలో సోమవారం 24 ఏళ్ల వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. అనంతరం కత్తితో పొడిచి పారిపోయారు. బాధితురాలు తన భర్తకు జరిగిదంతా ఫోన్​లో చెప్పింది. అప్పుడు వెంటనే అతను ఇంటికి చేరుకుని బాధితురాలిని ఆసుపత్రికి తరలించాడు. గురుగ్రామ్​లోని సివిల్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడం వల్ల దిల్లీలోని సఫ్థార్ జంగ్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. నిందితుడిని అజయ్​ ఠాకూర్​గా పోలీసులు గుర్తించారు. అతడు బిహార్ వాసి అని తెలిపారు. మరొక నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వివాహేతర సంబంధం అనుమానంతో: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను హత్యచేశాడు ఓ కిరాతకుడు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లోని ఫిరోజాబాద్​లో మంగళవారం జరిగింది. మృతురాలికి ఐదేళ్లు, ఏడేళ్లు వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. నిందితుడు కత్తితో పొడిచి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: 'మసీదులపై అవి తీసేయాల్సిందే'.. కేసు పెట్టినా వెనక్కితగ్గని ఠాక్రే

Last Updated : May 4, 2022, 2:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.