ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరి హింసాత్మక ఘటనలో(lakhimpur kheri incident ) మృతి చెందిన ఇద్దరు భాజపా కార్యకర్తలు(bjp lakhimpur kheri), కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా డ్రైవర్ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ ముగ్గురిలో ఇద్దరు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
అక్టోబర్ 3వ తేదీన లఖింపుర్ ఖేరిలో చెలరేగిన ఘర్షణలో మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో నలుగురు రైతులు, ఓ పాత్రికేయుడు, ఇద్దరు భాజపా సభ్యులు, కారు డ్రైవర్ ఉన్నారు. ఇప్పటికే.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన రైతులు, జర్నలిస్ట్ కుటుంబాలకు రూ.45 లక్షల చొప్పున పరిహారం అందించింది ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం.
చెక్కులు అందించిన స్థానిక ఎమ్మెల్యే..
భాజపా సభ్యుడు శుభమ్ మిశ్రా, కేంద్ర మంత్రి కారు డ్రైవర్ హరిఓమ్ మిశ్రాల కుటుంబ సభ్యులను తాజాగా కలిసి చెక్కులను అందించారు లఖింపుర్ ఎమ్మెల్యే యోగేశ్ వర్మ. మరోవైపు.. ప్రాణాలు కోల్పోయిన మరో భాజపా సభ్యుడు శ్యామ్ సుందర్ కుటుంబానికి స్థానిక తహసీల్దార్ చెక్కును అందించారు.
ఇదీ చూడండి: Navjot Singh Sidhu News: లఖింపుర్ ఖేరిలో సిద్ధూ నిరాహార దీక్ష