ETV Bharat / bharat

కూలీకి జాక్​పాట్, దారిలో వెళ్తుండగా దొరికిన వజ్రం, రాత్రికి రాత్రే లక్షాధికారిగా - డైమండ్ ఆఫీస్ పన్నా

Panna Diamond News దుకాణం నుంచి ఇంటికి వెళ్తున్న ఓ కూలీకి.. దారిలో వజ్రం దొరికింది. దాని విలువ రూ.5లక్షలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్​లో జరిగింది.

Panna Labour Found Diamond
కూలీకి దొరికిన వజ్రం
author img

By

Published : Aug 21, 2022, 5:01 AM IST

Panna Diamond News: మధ్యప్రదేశ్​ పన్నా జిల్లాలో ఓ కూలీకి అదృష్టం వరించింది. దుకాణం నుంచి ఇంటికి వస్తున్న నందిలాల్ రజక్ అనే కూలీకి డైమండ్ కనిపించింది. సాధారణ రంగు రాయి కావొచ్చేమో అని అనుకున్నాడు రజాక్. అయితే ఆ వజ్రాన్ని పన్నాలోని డైమండ్​ ఆఫీసులో తనిఖీ చేయించాడు. అది ఒర్జినల్ డైమండ్ అని అధికారులు తెలిపారు. దీంతో సంతోషంతో తేలిపోయాడు రజాక్.

Panna Labour Found Diamond
కూలీని వరించిన అదృష్టం

అసలేం జరిగిందంటే..
రాణిగంజ్​కు చెందిన నందిలాల్ రజాక్ అనే వ్యక్తి బల్దేవ్​ చౌక్​లోని కిరాణ దుకాణంలో పనిచేస్తున్నాడు. దుకాణం నుంచి ఇంటికి వస్తుండగా అతడికి డైమండ్ కనిపించింది. అయితే అది రంగు రాయిగా భావించాడు. అది తీసుకుని తన అత్తవారింటికి వెళ్లాడు. అక్కడ ఇరుగుపొరుగు వారికి చూపించగా.. అది నిజమైన వజ్రంలా ఉందని అతడితో అన్నారు. దీంతో తన స్నేహితులతో కలిసి వజ్రాన్ని తీసుకుని డైమండ్ కార్యాలయానికి వెళ్లాడు నందిలాల్. ఆ వజ్రాన్ని పరిశీలించిన అధికారులు.. 2.83 క్యారెట్లు ఉందని తేల్చారు. ఆ వజ్రం ఖరీదు సుమారు రూ.5లక్షలు ఉంటుందని చెప్పారు. దాన్ని వేలం వేసి వచ్చిన డబ్బులు రజాక్​కు ఇవ్వనున్నారు అధికారులు.

Panna Labour Found Diamond
కూలీని వరించిన అదృష్టం

"వజ్రం వేలం ద్వారా వచ్చిన డబ్బుతో ఇల్లు కట్టుకుంటా. మిగిలిన డబ్బులతో ఏదైనా వ్యాపారం చేసుకుంటా. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నా."
--నందిలాల్ రజాక్, కూలీ

బుందేల్​ఖండ్​ ప్రాంతంలోని పన్నా జిల్లా వజ్రాలకు ప్రసిద్ధి. ఇక్కడ వజ్రాల వెలికితీతకు ప్రభుత్వమే భూముల్ని లీజుకు ఇస్తూ ఉంటుంది. అలా దొరికిన వజ్రాల్ని పన్నాలోని డైమండ్​ ఆఫీస్​లో జమ చేస్తే.. అధికారులు వాటి నాణ్యతను నిర్ధరించి, వేలం వేస్తారు.

ఇవీ చదవండి: కాటన్​కు బదులు కండోమ్ కవర్లతో చికిత్స, పీహెచ్​సీ సిబ్బంది నిర్లక్ష్యం

2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.