ETV Bharat / bharat

ఫ్రీ విమాన టికెట్ అంటూ ఎర.. లింక్ క్లిక్ చేశారో అంతే సంగతులు.. - ఫ్రీ విమాన టికెట్

Free Flight Ticket: సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఇటీవల ఎమిరేట్స్ ఎయిర్​లైన్స్ పేరిట ఓ లింక్‌ వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్‌ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పొరపాటున లింక్ క్లిక్ చేశారో మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్​ నేరగాళ్ల చేతిలో పెట్టినట్లే అవుతుంది.

free ticket contest
ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌
author img

By

Published : Aug 12, 2022, 4:42 PM IST

Free Flight Ticket: సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఫ్రీ రీఛార్జి పేరుతోనో, కంపెనీ వార్షికోత్సవం పేరుతోనో ఫేక్‌ లింక్‌లు సృష్టించి మోసాలకు పాల్పడేవారు.. తాజాగా గివ్‌ అవే పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్‌ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పొరపాటున క్లిక్‌ చేశారో ఇక అంతే సంగతులు.

ఇటీవల ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ పేరిట ఓ లింక్‌ వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే చిన్న క్విజ్‌ నిర్వహిస్తారు. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మీకో కొత్త పేజీ దర్శనమిస్తుంది. ఆ తర్వాత మీరు యూరప్‌ రౌండ్‌ ట్రిప్‌ టికెట్లు గెలుచుకున్నారంటూ ఓ సందేశం వస్తుంది. ఈ క్విజ్‌ను మీ ఫ్రెండ్స్‌తో షేర్‌ చేసుకోవాలని అడుగుతుంది. కనీసం 30 మంది ఫ్రెండ్స్‌ లేదంటే ఐదు వాట్సాప్‌ గ్రూపులకు పంపించమని కోరుతుంది. ఒకవేళ మీరు నమ్మి అలా షేర్‌ చేస్తే మీతో పాటు మరో నలుగురిని సైతం ప్రమాదంలోకి నెట్టినట్లే.

ఇలాంటి లింకులు కేవలం మొబైల్‌లోనే ఓపెన్‌ అవుతాయి. ఇప్పుడు సర్క్యులేట్‌ అవుతున్న లింక్‌ సైతం ఆ కోవకు చెందినదే. షార్ట్‌ యూఆర్ఎల్ రూపంలో ఈ లింక్‌ కనిపిస్తోంది. లింక్‌ ప్రివ్యూ మాత్రం అచ్చం ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ను పోలి ఉంది. ఇక్కడే చాలా మంది బోల్తా పడుతుంటారు. కాబట్టి ఇలాంటి లింకులు వచ్చినప్పుడు సంస్థ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లి ఆరా తీయడం మంచిది. ప్రస్తుతం సర్క్యులేట్‌ అవుతున్న లింక్‌ క్లిక్‌ చేస్తే ఎమిరేట్స్‌ వెబ్‌సైట్‌ను పోలి ఉన్న మరో సైట్‌కు రీడైరెక్ట్‌ అవుతోంది. ఇది ఇటీవలే తెరిచినట్లు తెలుస్తోంది. ఒకసారి ఈ లింక్‌ క్లిక్‌ చేస్తే మీ వ్యక్తిగత సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్ల చేతిలో పెట్టినట్లేనని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. ఒక్కోసారి మీ ఖాతాలు సైతం ఖాళీ చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి: ప్రగతి పథంలో ప్రజా రథం.. 75 ఏళ్ల అభివృద్ధి యజ్ఞం

ఎమ్మెల్యే అల్లుడి కారు బీభత్సం- ఆరుగురు బలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.