ETV Bharat / bharat

బాలుడి ప్రయోగం.. యూట్యూబ్ చూసి మద్యం తయారీ.. స్నేహితుడికి తాగించగానే.. - వైన్ తాగి విద్యార్థి అస్వస్థత

ప్రస్తుతం సోషల్​ మీడియాలో వీడియోలు చూసి నెటిజన్లు.. తమకు రాని విద్యలను నేర్చుకుంటున్నారు. తెలియని ఎన్నో విషయాలను తెలుసుకుంటున్నారు. అయితే కేరళకు చెందిన ఓ 12 ఏళ్ల విద్యార్థి మాత్రం కాస్త వెరైటీగా యూట్యూబ్​ చూసి మద్యం​ తయారు చేశాడు. కానీ కథ అక్కడే అడ్డం తిరిగి.. ఆ వైన్ అతడి ఫ్రెండ్​​ తాగి అస్వస్థతకు గురయ్యాడు.

kerala boy wines makes
యూట్యూబ్ చూసి మద్యం తయారీ
author img

By

Published : Jul 30, 2022, 3:23 PM IST

యూట్యూబ్​లో వీడియోలు చూసి ద్రాక్ష పండ్లతో మద్యాన్ని తయారుచేశాడు ఓ 12 ఏళ్ల యువకుడు. ఈ వైన్​ను తన మిత్రుడికి ఇవ్వగా.. తాగిన అనంతరం అతడు అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు చేసుకొని ఆస్పత్రిలో చేరాడు. ఈ ఘటన కేరళ తిరువనంతపురం చిరాయింకీజులో శుక్రవారం జరిగింది.

కల్తీ మద్యం తాగిన బాలుడ్ని చిరాయింకీజులోని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడని పోలీసులు తెలిపారు. వైన్ బాటిల్​ను స్థానిక కోర్టు అనుమతితో పరీక్షల నిమిత్తం ల్యాబ్​కు పంపారు పోలీసులు. వైన్​లో మరేదైనా ఆల్కహాల్ కలిపినట్లు, ఇంకేదైనా రసాయనాలు కలిపినట్లు తేలితే బాలుడిపై కేసు కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

తల్లిదండ్రులు తెచ్చిన ద్రాక్ష పండ్లతోనే..
తన తల్లిదండ్రులు కొనుగోలు చేసిన ద్రాక్ష పండ్లతోనే మద్యం తయారు చేశానని బాలుడు చెప్పాడు. అందులో ఏం రసాయనాలు కలపలేదని తెలిపాడు. యూట్యూబ్​లో చూపించిన విధంగానే వైన్ తయారు చేసి.. కొన్ని గంటలు భూమిలో పాతిపెట్టినట్లు వివరించారు. ఆ తర్వాత స్నేహితుడికి ఇచ్చినట్లు చెప్పాడు.

ఇవీ చదవండి: 'మహా' గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు.. ముంబయి దేశ ఆర్థిక రాజధాని కాదంటూ!

'న్యాయాన్ని ప్రతి గడపకు చేర్చాలి.. ఎందరో మౌనంగా బాధపడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.