ETV Bharat / bharat

స్వప్న ఆరోపణలతో చిక్కుల్లో అధికార పక్షం.. ఆ వీడియోతో సీఎంఓ కౌంటర్​ - కేరళ సీఎంఓ

రెండేళ్ల క్రితం కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకొన్న 30 కిలోల బంగారం వ్యవహారం ఇప్పుడు కేరళ పాలక పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులో ప్రధాన నిందితురాలు ఏకంగా సీఎం సహా ఆయన కుటుంబ సభ్యులకు ఇందులో భాగముందంటూ సంచలన ప్రకటన చేసింది. ఈ క్రమంలో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్​గా ఓ వీడియోను విడుదల చేసింది ముఖ్యమంత్రి కార్యాలయం. అయితే.. ముఖ్యమంత్రిపైనే బంగారం స్మగ్లింగ్‌ ఆరోపణలు చేసిన ఆ మహిళ ఎవరు..? ఆ కేసు ఏమిటి..?

KL Gold video
బంగారం స్మగ్లింగ్​ కేసు, పినరయి విజయన్​, స్వప్న సురేశ్​
author img

By

Published : Jun 15, 2022, 3:29 PM IST

బంగారం స్మగ్లింగ్​ కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​పై చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సీఎం, ఆయన కుటుంబ సభ్యులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆమె చేసిన ఆరోపణలను ముఖ్యమంత్రి కార్యాలయం తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. ఈ మేరకు రెండేళ్ల క్రితం నాటి పలు వీడియోలను విడుదల చేసింది. అప్పటి యూఏఈ కాన్సులేట్​ జనరల్​తో కలిసి స్వప్న సురేశ్​ ముఖ్యమంత్రి కార్యాలయానికి పలు మార్లు అధికారిక పని కోసం మాత్రమే వచ్చినట్లు పేర్కొంది.

సామాజిక మాధ్యమాల వేదికగా రెండు భాగాలుగా ఓ చిన్న వీడియోను విడుదల చేసింది సీఎంఓ. తాను ఎవరో తెలియదని సీఎం అబద్ధం చెప్పారని, ఆ విషయాలను బయటపెడతానని స్వప్న సురేశ్​ మంగళవారం చేసిన బెదిరింపులను తోసిపుచ్చేందుకు, ఆమె ఒక కాన్సులేట్​ ఉద్యోగిగా మాత్రమే తెలుసునన్న విజయన్​ మాటలను ధ్రువీకరించే ప్రయత్నం చేసింది సీఎంఓ.

బంగారం స్మగ్లింగ్ కేసు రాజకీయ దుమారం రేపిన క్రమంలో.. 2020, అక్టోబర్​ 13న ఓ ప్రెస్​మీట్​లో పాల్గొన్నారు విజయన్​. సీఎం అధికారిక కార్యాలయానికి స్వప్న సురేశ్​ వచ్చారా? అని విలేకరి అడిగగా.. ఆమె యూఏఈ కాన్సులేట్​ జనరల్​తో అధికారిక పనిపై పలుమార్లు తన కార్యాలయానికి వచ్చినట్లు ఎలాంటి బెరుకు లేకుండా చెప్పారు సీఎం. 'కాన్సులేట్​ జనరల్​ అధికారిక పనిపై సీఎం కార్యాలయానికి వచ్చినప్పుడు ఆయన సెక్రెటరీగా ఆమె సైతం వచ్చారు. ఒక కాన్సులేట్​ జనరల్​ను ముఖ్యమంత్రి కలవటం తప్పేమీ కాదు.' అని సమాధానమిచ్చారు.

కేరళ ముఖ్యమంత్రిపై తీవ్ర ఆరోపణలు.. బంగారం స్మగ్లింగ్​ కేసులో స్వప్న సురేశ్​, సందీప్​ నయర్​ను 2020, జులై 11న కస్టడీలోకి తీసుకుంది జాతీయ దర్యాప్తు సంస్థ. 16 నెలల జైలు జీవితం తర్వాత గత ఏడాది నవంబర్​లో విడుదలైంది స్వప్న సురేశ్​. స్వప్న సురేశ్​ ఇటీవల ఒక విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌, ఆయన భార్య కమల, కుమార్తె వీణ, మాజీ ఐఏఎస్‌ శివశంకర్‌, మాజీ చీఫ్‌ సెక్రటరీ నళినీ నెట్టో, ఆఫీస్‌ కార్యదర్శి రవీంద్రన్‌కు బంగారం స్మగ్లింగ్‌ కేసులో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు చేసింది. అంతేకాదు తన ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు తరచూ ప్రకటనలు చేస్తోంది. దీంతోపాటు కేసుకు సంబంధించిన వివరాలంటూ పలు అంశాలను ప్రస్తావిస్తోంది. ఇవి ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.

అసలు స్వప్నా సురేష్‌ ఎవరు..? కేరళ నుంచి అబుదాబీకి వెళ్లిన ఓ కుటుంబంలో స్వప్న జన్మించింది. ఆమె అరబిక్‌ భాషను అనర్గళంగా మాట్లాడగలదు. దీంతో ఆమె అబుదాబీ ఎయిర్‌పోర్టులో ప్యాసింజర్‌ సర్వీస్‌ విభాగంలో కొన్నాళ్లు పనిచేసింది. 2013లో ఎయిర్‌ ఇండియా స్టేట్‌ ఎయిర్‌పోర్టు సర్వీస్‌లో హెచ్‌ఆర్‌ ఎగ్జిక్యూటివ్‌గా చేరింది. అక్కడ ఒక ఎయిర్‌పోర్టు ఉద్యోగిపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసేందుకు సహోద్యోగితో కలిసి కుట్రపన్నినట్లు ఈమెపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తును తన పరపతిని వాడుకొని అడ్డుకొంది. 2016లో కేరళలోని కాన్సులేట్‌ జనరల్‌ ఆఫీస్‌లో పీఆర్‌ఓగా చేరింది. కేరళ వాసులు ఎక్కువగా గల్ఫ్‌ దేశాల్లో ఉండటంతో.. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం యూఏఈ దౌత్య కార్యాలయంతో సన్నిహిత సంబంధాలను నెరుపుతుంది. ఈ నేపథ్యంలో స్వప్న రాజకీయ, బ్యూరోక్రటిక్‌ సర్కిల్‌లో పరిచయాలను పెంచుకొంది. కానీ, ఆమెపై క్రిమినల్‌ కేసు కారణంగా.. 2019లో ఆ ఉద్యోగం నుంచి తొలగించారు. కానీ, అప్పటికే ఐఏఎస్‌ అధికారులతో ఉన్న పరిచయాల కారణంగా ‘కేరళ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌లో ఉద్యోగం సంపాదించారు. దీనికి నాటి ఐటీ సెక్రటరీ శివశంకర్‌ సహకరించారు. వాస్తవానికి ఆమె 12వ తరగతి మాత్రమే పూర్తి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆమె దాదాపు 16 నెలలు జైలు జీవితం గడిపి గతేడాది విడుదలైంది. వడక్కంచెరిలో యూఏఈ నిధులతో నిర్మించ తలపెట్టిన లైఫ్‌ మిషిన్‌ ప్రాజెక్టులో లంచాలు స్వీకరించినట్లు కూడా స్వప్నపై ఆరోపణలు వచ్చాయి.

30కిలోల బంగారం స్వాధీనంలో హైడ్రామా.. దుబాయ్‌ నుంచి దౌత్య కార్యాలయ సిబ్బంది బ్యాగుల్లో భారీ ఎత్తున బంగారం త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుతోందని కస్టమ్స్‌ అధికారులకు సమాచారం అందింది. 2020 జూన్‌ 30వ తేదీన దుబాయ్‌ నుంచి పంపిన బ్యాగ్‌ను జులై1వ తేదీన అధికారులు ఆధీనంలోకి తీసుకొన్నారు. 2వ తేదీన విదేశాంగశాఖ అధికారులు ఆ బ్యాగ్‌ను తెరిచేందుకు నోఅబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని యూఏఈ దౌత్యకార్యాలయాన్ని కోరారు. కానీ, యూఏఈ కాన్సులేట్ అడ్మిన్‌ ఆ బ్యాగ్‌ను తిరిగి దుబాయ్‌ పంపాలని డిమాండ్‌ చేశారు. కానీ, పట్టువదలని విదేశాంగ శాఖ రెండోసారి లేఖరాయడంతో యూఏఈ దౌత్యకార్యాలయం ఆ బ్యాగును తెరిచేందుకు అంగీకరించింది. వియన్నా ఒప్పందం ప్రకారం కొన్ని నిబంధనలు పాటించకుండా దానిని తెరవకూడదు. తిరువనంతపురంలోని యూఏఈ దౌత్య కార్యాలయం అడ్మిన్‌ అటాచే సమక్షంలో ఈ బ్యాగ్‌ను తెరవగా.. 30 కిలోల బంగారం బయటపడింది. దౌత్యసిబ్బంది ఇది తమకు చెందింది కాదని తేల్చిచెప్పారు. దీంతో ఈ బ్యాగ్‌ను తెప్పించిన దౌత్యకార్యాలయ మాజీ పీఆర్‌వో సరితా కుమార్‌ ఇంటిని కస్టమ్స్‌ అధికారులు తనిఖీలు చేసి.. అతనికి సమన్లు జారీ చేశారు. ఆ తర్వాత ఆ బ్యాగ్‌ను యూఏఈ దౌత్యకార్యాలయ మాజీ పీఆర్వో స్వప్నా సురేష్‌ తెప్పించినట్లు తేలింది.

జులై 10వ తేదీన రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. మర్నాడే స్వప్న, సందీప్‌ నాయర్‌ అనే వ్యక్తులను అరెస్టు చేసింది. కీలక సూత్రధారిగా భావిస్తోన్న రమీజ్‌ కేటీను అరెస్టు చేసి మనీలాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది. ఇతను కేరళ మాజీ మంత్రి చక్కేరి అహ్మద్‌ కుట్టీ బంధువు.

సీఎం కార్యాలయానికీ లింకులు.. అరెస్టు సమయానికి స్వప్నా సురేష్‌.. కేరళ ముఖ్యమంత్రి పినరయ్‌ విజయన్‌ స్వయంగా నిర్వహించే ఐటీశాఖలో ఓ ప్రాజెక్టులో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు ఎటువంటి అర్హత లేకపోయినా.. తప్పుడు ధ్రువీకరణల ఆధారంగా నాటి ప్రిన్సిపల్‌ కార్యదర్శి శివశంకర్‌ నియమించినట్లు తేలింది. సీఎంకు అత్యంత సన్నిహిత అధికారిగా శివశంకర్‌కు పేరుంది. స్వప్న నియామక సమయంలో క్రిమినల్‌ బ్యాగ్రౌండ్‌పై ఎటువంటి దర్యాప్తు చేయలేదు. శివశంకర్‌పై ఆరోపణలు గుప్పుమనడంతో సీఎం కార్యాలయం ఆయన్ను ప్రిన్సిపల్‌ కార్యదర్శి, ఐటీశాఖ కార్యాదర్శి పదవుల నుంచి తప్పించింది. అదే ఏడాది నవంబర్‌లో కస్టమ్స్‌ విభాగం ఆయన్ను అరెస్టు చేసింది. కానీ, తగిన ఆధారాలు లేకుండా అరెస్టు చేసినట్లు కోర్టు అభిప్రాయపడుతూ కొన్ని నెలల తర్వాత బెయిల్‌ మంజూరు చేసింది. ఆ తర్వాత శివశంకర్‌ తన జీవిత కథను ‘అశ్వత్థాత్మవు వెరుమ్‌ ఒరు ఆనా’ (అశ్వత్థామ కేవలం ఒక ఏనుగు) పుస్తక రూపంలో విడుదల చేశారు. బంగారం స్మగ్లింగ్‌ కేసులో తాను అమాయకుడినని చెప్పుకొనే యత్నం చేశారు. స్వప్నా సురేష్‌పై పలు ఆరోపణలు కూడా అందులో ఉన్నాయి.

ఇదీ చూడండి: 'సీఎం వల్లే నేను బంగారం స్మగ్లింగ్​ చేయాల్సి వచ్చింది'

'ఆయనతో సంబంధంపై పుస్తకం రాసేందుకు సిద్ధం'

'ఎన్​డీఏ, ఎల్​డీఎఫ్​ మధ్య అంతర్గత సంబంధాలు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.