ETV Bharat / bharat

పేదల ఇంటికి ఫైబర్​నెట్​.. 'ఫ్రీ'గా హై స్పీడ్ ఇంటర్నెట్​ కనెక్షన్​.. - K FON Kerala

Kerala Fibre Optic Network Inauguration : కేరళ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కే-ఫోన్ (కేరళ ఫైబర్​ ఆప్టిక్​ నెట్​వర్క్) ప్రాజెక్టును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టుతో పేదలకు ఉచితంగా ఇంటర్నెట్​ సేవలను అందిస్తామని ఆయన చెప్పారు. ఇదే అసలైన 'కేరళ స్టోరీ' అని విజయన్​ అన్నారు.

kerala fibre optic network inauguration ceremony

author img

By

Published : Jun 5, 2023, 7:37 PM IST

Updated : Jun 5, 2023, 8:23 PM IST

Kerala Fibre Optic Network Inauguration : ​20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్​ అందించేందుకు అడుగు ముందుకేసింది కేరళ ప్రభుత్వం. అందులో భాగంగా చేపట్టిన కే-ఫోన్​ (కేరళ ఫైబర్ ఆప్టిక్​ నెట్​వర్క్​) ప్రాజెక్టును సోమవారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా చౌక ధరలకు ఇంటర్నెట్​ను అందించనున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న ధరలకన్నా.. తక్కువ ధరలకే ఇంటర్నెట్​ను అదిస్తామని కేరళ ప్రభుత్వం చెబుతోంది. కే-ఫోన్​లో పాజెక్టు మొదటి దశలో భాగంగా 14 వేల ఇళ్లకు ఇంటర్నెట్​ కనెక్షన్​ ఇవ్వనున్నారు. అందులో తొలుత ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఇంటర్నెట్​ సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కే-ఫోన్​లో పాజెక్టు మొదటి దశలో ప్రతి నియోజకవర్గంలో 100 కుటుంబాలకు ఇంటర్నెట్​ సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా హై స్పీడ్​ ఇంటర్నెట్​ సేవలు అందిస్తామని చెప్పింది.

K-FON Kerala : ఆర్థికంగా వెనుకబడిన ​20 లక్షల కుటుంబాలకు ఉచిత ఇంటర్నెట్​ సేవలను అందిస్తామని కేరళ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. అందులో భాగంగానే కే-ఫోన్​ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టును కేరళ రాష్ట్ర ఐటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​, కేరళ రాష్ట్ర విద్యుత్​ బోర్డు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా 40 లక్షల కనెక్షన్లు తీసుకోవచ్చు. 20 ఎంబీపీఎస్​ వేగంతో ఇంటర్నెట్​ సేవలను అందించనున్నారు. వ్యక్తిగత అవసరాలకు ఇంకా ఎక్కువ వేగంతో ఇంటర్నెట్​ సేవలు అందుబాటులో రానున్నాయి. 30 వేల ప్రభుత్వ కార్యాలయాకు కనెక్షన్లు, 2,000 బహిరంగ ప్రదేశాల్లో వైఫై సౌకర్యం అందించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలైతే ఎక్కడైనా హై స్పీడ్​ ఇంటర్నెట్​ను వినియోగించుకోవచ్చు.

kerala fibre optic network inauguration ceremony
ప్రారంభోత్సవ సమావేశానికి హజరైన అతిథులు

కే-ఫోన్​ టారిఫ్ వివరాలను కూడా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ప్రాథమిక ప్లాన్​ రూ.299 (జీఎస్​టీ లేకుండా)కు 20 ఎంబీపీఎస్​గా ఉంది. దీంతో పాటు ప్రతి నెలా 3000 జీబీ డేటా డౌన్​లోడ్​ లిమిట్​​ విధించారు. ఇక ఇందులో అతిపెద్ద ప్లాన్​ రూ.1249 (జీఎస్​టీ లేకుండా) 250 ఎంబీపీఎస్​గా ఉంది. దీంతో పాటు ప్రతినెలా 5000 జీబీ డౌన్​లోడ్​ లిమిట్​ విధించారు.

కే-ఫోన్ ఇంటర్నెట్​ సర్వీస్​ ప్రొవైడర్లను టెండర్​ ప్రక్రియ ద్వారా ఎంపిక చేస్తారు. జూన్​ నెలాఖరుకల్లా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కే-ఫోన్​కు ఇప్పటివరకు 1000 మందికి పైగా సబ్​స్క్రైబర్లు ఉన్నారు. 7000 కెనెక్షన్లకు కేబుల్స్​ వేయడం పూర్తైంది. 17,280 ప్రభుత్వ కార్యాలయాలకు ఇప్పటికే కనెక్షన్లు ఇచ్చారు. 10 జిల్లా కలెక్టరేట్లు కే-ఫోన్​ సేవలను వినియోగించుకుంటున్నాయి. ఈ ప్రాజెక్టును రూ. 1,500 కోట్ల అంచనా వ్యయంతో మొదలుపెట్టింది కేరళ సర్కార్​. ఇందులో భాగంగా ఇప్పటికే 30 వేల కిలోమీటర్ల కేబుళ్లు వేశారు.

Kerala Fibre Optic Network Inauguration

Last Updated : Jun 5, 2023, 8:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.