ETV Bharat / bharat

పాములు పట్టే నేర్పరినే కాటేసిన కోబ్రా.. పరిస్థితి విషమం

Snake Catcher Vava Suresh: పాములు పట్టడంలో దిట్ట అయిన కేరళవాసి వావ సురేశ్​.. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. ఓ పామును పట్టుకునేందుకు వెళ్లిన ఆయన మోకాలిపై కోబ్రా కాటేసింది.

author img

By

Published : Feb 1, 2022, 8:31 AM IST

Updated : Feb 1, 2022, 10:48 AM IST

Famous snake catcher Vava Suresh
Famous snake catcher Vava Suresh
పామును పట్టుకుంటుండగా కాటు

Snake Catcher Vava Suresh: విషపూరితమైన పాములు పట్టడంలో దేశవ్యాప్తంగా పేరుగాంచిన కేరళవాసి వావ సురేశ్‌.. పాటు కాటుకు గురయ్యారు. కొట్టాయంలోని కురిచి ప్రాంతంలో కోబ్రా ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లాడు సురేశ్​. పామును పట్టుకునేందుకు ప్రయత్నించగా.. కోబ్రా అతని మోకాలిపై కాటు వేసింది. వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించగా.. కొట్టాయం మెడికల్‌ కళాశాల ఆస్పత్రికి తరలించారు.

సోమవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన.

ఇప్పటికీ సురేశ్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేరళ మంత్రి వీఎన్​ వాసవన్​ కూడా దీనిపై స్పందించారు. సురేశ్​ను కాపాడేందుకు అన్ని సదుపాయాలు కల్పించినట్లు, వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వెల్లడించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీ చూడండి: భాజపా వ్యూహం- అఖిలేశ్​పై బరిలోకి కేంద్రమంత్రి

లక్కీ ఫ్యామిలీ.. 24ఏళ్ల క్రితం చోరీకి గురైన బంగారం ఇప్పుడు వాపస్!

Last Updated : Feb 1, 2022, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.