ETV Bharat / bharat

'పాముతో భార్యను చంపింది భర్తే'.. సూరజ్​ను దోషిగా తేల్చిన కోర్టు - కొల్లా కోర్టు

పాముతో భార్యను కరిపించి హత్య చేసిన కేసులో భర్తను దోషిగా తేల్చింది కేరళలోని జిల్లా కోర్టు(uthra murder case verdict ). ఉద్దేశపూర్వకంగానే పాముతో కాటు వేయించినట్లు నిర్ధరించింది.

Uthra case
భార్యను పాముతో కరిపించిన భర్త
author img

By

Published : Oct 11, 2021, 2:02 PM IST

దేశవ్యాప్తంగా సంచనలంగా మారిన 'ఉత్రా కేసు'లో కీలక తీర్పు వెలువరించింది కేరళలోని కొల్లాం జిల్లా కోర్టు(uthra murder case verdict). భార్య ఉత్రాను ఆమె భర్త ఉద్దేశపూర్వకంగానే పాముతో కాటు వేయించి హత్య(uthra murder case latest news) చేసినట్లు తేల్చింది.

దోషిగా తేలిన సూరజ్​కు అక్టోబర్​ 13న శిక్ష ఖరారు చేయనున్నట్లు తెలిపింది కోర్టు.

ఏంటీ కేసు..?

కేరళ కొల్లాం జిల్లాలోని అంచల్​ పట్టణానికి చెందిన ఉత్రా, సూరజ్​ భార్యభర్తలు. పెళ్లి తర్వాత కొన్నాళ్లుగా బాగానే ఉన్న సూరజ్​.. తరువాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. అందుకు అడ్డంగా ఉన్న తన భార్యను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎవరికీ అనుమానం రాకుండా హత్య(Uthra case) చేయాలని పథకం రచించాడు.

యూట్యూబ్​లో చూసి పాముల ద్వారా ఎలా హత్య చేయాలో నేర్చుకున్నాడు. సురేష్​ అనే పాములవాడికి డబ్బులు ఇచ్చి విష సర్పాన్ని తీసుకున్నాడు. ఇంటికి వచ్చి నిద్రపోతున్న భార్యపై ఆ పామును విసిరేయగా.. ఆమెను రెండు సార్లు కాటువేసింది. ఉత్రా ప్రాణాలు కోల్పోయింది. అంతకు ముందే ఓసారి పాము కాటుకు గురికావటంపై అనుమానించిన ఉత్రా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరజ్​ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలీలో విచారించి నిజాలు రాబట్టారు.

ఇవీ చూడండి: Uthra murder case: భర్తను పట్టించిన పాములు- ఎలాగంటే...

పాముతో భార్యను చంపింది.. అందుకోసమే!

హత్య కేసులో పాముకు శవపరీక్షలు.. తేలిందేంటంటే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.