ETV Bharat / bharat

ఆ రోజు టీకా తీసుకుంటే.. వాషింగ్​ మెషిన్​, మిక్సర్ గ్రైండర్ ఫ్రీ!

ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో కొవిడ్​ టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు(Vaccine Gifts) కురిపించనుంది తమిళనాడులోని ఓ జిల్లా యంత్రాంగం. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్‌ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను అందజేయనుంది.

vaccination lucky draw
టీకా లక్కీ డ్రా
author img

By

Published : Oct 9, 2021, 7:36 AM IST

అర్హులైన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఇచ్చేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కొందరు ప్రోత్సాహకాలు ప్రకటిస్తున్నారు. తమిళనాడులోని కరూర్ జిల్లా(Tamil Nadu Karur News) యంత్రాంగం కూడా ఈ తరహా చర్యలకే సిద్ధమైంది. రాష్ట్రంలో ఈ ఆదివారం జరగనున్న మెగా డ్రైవ్‌లో(Mega Vaccination Drive) టీకా తీసుకునే వారిపై కానుకల జల్లు(Vaccine Gifts) కురిపించనుంది. లక్కీ డ్రా ద్వారా విజేతలను ఎంపిక చేసి.. వాషింగ్‌ మెషిన్, వెట్ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్‌తో సహా పలు బహుమతులను(Vaccine Gifts) అందజేయనుంది. ఈ మేరకు కరూర్ జిల్లా కలెక్టర్ టి.ప్రభు శంకర్ పత్రికా ప్రకటన విడుదల చేశారు.

"రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా టీకా వేయించుకున్న వారి కోసం జిల్లా యంత్రాంగం లక్కీ డ్రా నిర్వహించనుంది. లక్కీ డ్రా విజేతలకు బహుమతులు అందజేయనున్నాం. మొదటి మూడు స్థానాల విజేతలకు వాషింగ్‌మెషిన్, వెట్‌ గ్రైండర్, మిక్సర్ గ్రైండర్ అందజేస్తాం. 24 ప్రెజర్‌ కుక్కర్లు, 100 ప్రోత్సాహక బహుమతులు కూడా ఉన్నాయి. అలాగే టీకా కేంద్రాలకు లబ్ధిదారుల్ని తీసుకురావడంలో స్వచ్ఛందంగా పనిచేసేవారికి రూ.5 ప్రోత్సాహకంగా ఇస్తాం. 25 మంది కంటే ఎక్కువమందిని తీసుకువచ్చే వాలంటీర్ పేరు లక్కీ డ్రాలో చేర్చుతాం"

-టి.ప్రభు శంకర్​, కరూర్ జిల్లా కలెక్టర్.

కరూర్ జిల్లా యంత్రాంగం చేయనున్న ఈ వినూత్న ప్రయత్నాన్ని(Vaccine Gifts) తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి ప్రశంసించారు.

'ఆఫీస్‌కు రావొద్దు'

కరోనా టీకా తీసుకోని ఉద్యోగుల పట్ల దిల్లీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించనుంది. ఇప్పటివరకు కనీసం ఒక్క డోసు కూడా తీసుకోని ఉద్యోగులు అక్టోబర్ 16 నుంచి కార్యాలయాలకు వచ్చేందుకు అనుమతి నిరాకరించింది. ఒక్క డోసు అయినా తీసుకున్న తర్వాతే వారికి అనుమతి ఇవ్వనుంది. దానికి సంబంధించి దిల్లీ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.