ETV Bharat / bharat

సాంబార్​ రుచిగా లేదని.. తల్లి, సోదరి హత్య - సాంబార్ ఘర్షణ

మద్యం మత్తులో కన్నతల్లితో పాటు తోబుట్టువుపై దారుణానికి ఒడిగట్టాడు ఓ వ్యక్తి. సాంబార్ సరిగా చేయలేదన్న చిన్న కారణంతో.. వారిపై కాల్పులు జరిపి, ప్రాణాలు తీశాడు.

sambar killing of man
సాంబార్ బాగా వండలేదని హత్య
author img

By

Published : Oct 14, 2021, 1:47 PM IST

మద్యం మత్తులో ఓ వ్యక్తి క్రూరంగా ప్రవర్తించాడు. ఇంట్లో సాంబార్ రుచిగా చేయలేదన్న కారణంతో తల్లి, సోదరిపై కాల్పులు జరిపి, హత్య చేశాడు. ఈ దారుణ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో(Karnataka Uttara Kannada News) జరిగింది.

మృతులను సిద్ధాపుర్ తాలుకాలోని దోడ్​మణె గ్రామానికి చెందిన పార్వతీ నారాయణ హస్లార్​(42), ఆమె కుమార్తె రమ్యా నారాయణ హస్లార్​(19)గా అధికారులు గుర్తించారు. "పార్వతి కుమారుడు మంజునాథ హస్లార్​(24).. కొద్దిరోజులుగా మద్యానికి బానిసయ్యాడు. బుధవారం రాత్రి సాంబార్ విషయంలో తల్లి, సోదరితో అతడు ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో కోపోద్రిక్తుడైన అతడు.. నాటు తుపాకీతో వారిపై కాల్పులు జరిపాడు" అని పోలీసులు తెలిపారు.

ఘటన జరిగిన సమయంలో మంజునాథ తండ్రి ఇంట్లో లేడని పోలీసులు చెప్పారు. దీనిపై సిద్ధాపుర్ పోలీస్ స్టేషన్​లో అతడు ఫిర్యాదు చేశాడని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: చికెన్​ వండలేదని భార్యను కర్రతో కొట్టి చంపిన భర్త!

ఇదీ చూడండి: 'చికెన్​ ఫ్రై' బాగా వండలేదని భార్యను చంపేశాడు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.