ETV Bharat / bharat

కర్ణాటక ఎన్నికలు.. 502 మంది అభ్యర్థుల నామినేషన్​లు రిజెక్ట్.. పోటీలో ఎంతమందంటే? - కర్నాటక ఎన్నికల నామినేషన్లు

కర్ణాటక ఎన్నికల్లో నామినేషన్​ల ప్రకియ ఇటీవలే ముగిసింది. దీంతో అభ్యర్థుల నామినేషన్​ పత్రాలను ఎన్నికల అధికారులు పరిశీలించారు. 502 మంది అభ్యర్థుల నామినేషన్​లను తిరస్కరించారు. 3130 మంది అభ్యర్థుల నామినేషన్​లకు ఆమోదం తెలిపారు.

karnataka-election-2023-ec-rejected-502-candidates-nomination-papers
కర్నాటక ఎన్నికలు 2023
author img

By

Published : Apr 23, 2023, 10:40 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 502 మంది అభ్యర్థుల నామినేషన్​లు తిరస్కరణకు గురైనట్లు ఎన్నికల సంఘం తెలిపింది. 3130 మంది అభ్యర్థుల నామినేషన్​లను మాత్రమే లెక్కలోకి తీసుకున్నట్లు వెల్లడించింది. మొత్తం 3,632 అభ్యర్థులు.. 5,102 నామినేషన్​ పత్రాలు దాఖలు చేశారని పేర్కొంది. పరిశీలన అనంతరం సరైన వివరాలు లేని నామినేషన్​లను తిరస్కరించినట్లు వెల్లడించింది. గురువారంతో నామినేషన్​ పత్రాల దాఖలకు గడవు ముగియగా.. శుక్రవారం ఎన్నికల సంఘం వాటిని పరిశీలించింది.

ఆమోదం పొందిన మొత్తం 3130 నామినేషన్లలో.. 2890 మంది పురుషులు, 239 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారని అధికారులు తెలిపారు. ఒకరు మాత్రం ఇతరులకు చెందిన వారని వెల్లడించారు. చివరగా బీజేపీ నుంచి 224 మంది, కాంగ్రెస్​ నుంచి 223 మంది అభ్యర్థులు.. ఎన్నికల బరిలో నిలిచారని అధికారులు తెలిపారు. జేడీఎస్​ నుంచి 211 మంది అభ్యర్థులు, ఆప్​ నుంచి 212 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీకి అర్హులని తెలిపారు. బీఎసపీ నుంచి 137 మంది, సీపీఎం​ నుంచి నలుగురు, ఎన్​సీపీ నుంచి మరో నలుగురు.. ఎన్నికల పోటీలో ఉన్నారని అధికారులు వెల్లడించారు.

736 మంది అభ్యర్థులు గుర్తింపు పొందని పార్టీల నుంచి నామినేషన్లు దాఖలు చేశారని ఎన్నికల సంఘం తెలిపింది. మరో 1,379 మంది స్వతంత్రంగా బరిలో నిలిచారని పేర్కొంది. సోమవారం(ఏప్రిల్​ 24) నాటికి నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని ఎన్నికల సంఘం వెల్లడించింది. ఆ పక్రియ ముగిసిన అనంతరం చివరగా ఎంత మంది పోటీలో ఉంటారనే విషయం తెలుస్తోందని ఎన్నికల సంఘం పేర్కొంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఆ రాష్ట్ర 16వ అసెంబ్లీ ఎన్నికలు మే 10న జరగనున్నాయి. ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలు అదే నెల 13న వెల్లడించనున్నారు.

కన్నడనాట 'మార్పు' సంప్రదాయం.. బీజేపీకి షాక్ తప్పదా?.. చరిత్ర ఏం చెబుతోంది?
జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తో పాటు స్థానిక పార్టీలు సైతం క‌ర్ణాట‌క ఎన్నిక‌లను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా భావిస్తున్నాయి. ప్ర‌స్తుతమున్న అధికారాన్ని నిల‌బెట్టుకోవాల‌ని క‌మ‌లం పార్టీ చూస్తుండ‌గా.. గ‌తంలో కోల్పోయిన అధికారాన్ని ఈ సారి ఎలాగైనా చేజిక్కుంచుకోవాల‌ని కాంగ్రెస్‌, జేడీఎస్​లు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే.. క‌ర్ణాట‌క రాజ‌కీయ చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే 1985 త‌ర్వాత అక్క‌డ జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఏ పార్టీ కూడా వ‌రుస‌గా రెండు సార్లు గెలిచింది లేదు. అక్క‌డ జ‌రిగిన తొలి ఆరు ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం సాధించ‌గా.. అనంత‌రం జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో జ‌న‌తా పార్టీ గెలుపొందింది. త‌ర్వాత నుంచి ఏ పార్టీ కూడా వ‌రుస‌గా రెండు సార్లు రాష్ట్రంలో స్వ‌తంత్రంగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌లేక‌పోయింది. పూర్తి కథనం కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.