ETV Bharat / bharat

మైదానంలో కుర్రాడి మెరుపులు.. ఒకే మ్యాచ్​లో 407 రన్స్​తో రికార్డ్! - కర్ణాటకలో అండర్​ 16 క్రికెట్​ టోర్నమెంట్​

ఎంతో ఉత్కంఠగా జరుగుతున్న ఓ మ్యాచ్​లో విజృంభించిన ఓ కుర్రాడు తన జట్టును గెలిపించడమే కాకుండా ఓ అరుదైన రికార్డు సృష్టించాడు. 50 ఓవర్ల మ్యాచ్​లో ఏకంగా 407 రన్స్ తీశాడు.

Boy who scored 407 runs with 48 fours and 28 sixes

author img

By

Published : Nov 13, 2022, 1:29 PM IST

ఓ వైపు సీరియస్​గా మ్యాచ్​ జరుగుతోంది. ఇక తాడో పేడో తేల్చుకుందామని బరిలోకి దిగిన ఓ కుర్రాడు 50 ఓవర్ల మ్యాచ్​లో ఏకంగా 48 ఫోర్లు, 28 సిక్స్​లు కొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 16 ఏళ్ల వయసులో ఈ ఘనతను సాధించిన ఆ అబ్బాయి గురించి ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. కర్ణాటక శివమొగ్గలోని పీసెట్ కళాశాల మైదానంలో కర్ణాటక క్రికెట్​ అసోషియేషన్​ ఆధ్యర్యంలో జరిగిన అండర్​-16 గ్రూప్ క్రికెట్ టోర్నమెంట్‌లో సాగర్ క్రికెట్ క్లబ్ అనే జట్టుకు, ఏటీసీసీ భద్రావతి అనే మరో జట్టుకు మధ్య మ్యాచ్‌ జరిగింది. సాగర్​ టీమ్​ నుంచి బరిలోకి దిగి విజృంభించిన తన్మయ్ మంజునాథ్​ ఏకంగా 407 రన్స్ స్కోర్​ చేశాడు.

తన్మయ్ మంజునాథ్ చేసిన స్కోర్​తో ఆ జట్టు 583 పరుగులతో ఘన విజయాన్ని అందుకుంది. సుమారు 165 బంతుల్లో 48 ఫోర్లు, 24 సిక్సర్లతో ఈ స్కోర్​ను సాధించిన తన్మయ్​కు 120 పరుగులు చేసిన మరో క్రీడాకారుడు అన్షు తోడయ్యాడు. దీంతో వీరిద్దరూ పార్ట్​నర్‌షిప్‌లో 350 పరుగులు సాధించారు. తర్వాత బ్యాటింగ్​కు దిగిన భద్రావతి జట్టు 73 పరుగులకే ఆలౌట్ అయింది.

ఇదీ చదవండి: తాను చనిపోయి మరో ఇద్దరిని బతికించిన 18 నెలల చిన్నారి.. చిన్న వయసులోనే అవయవదానం

ఆ గ్రామంలో పిల్లలకు జన్మనివ్వడం నిషేధం.. ప్రసవిస్తే అంతే.. ఆ శాపమే కారణం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.