కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సక్రేబైలు ఏనుగుల శిబిరంలోని ఓ రెండేళ్ల గున్న ఏనుగుకు(baby elephant name) 'పునీత్ రాజ్‌కుమార్'గా(punit raj kumar news) నామకరణం చేశారు అధికారులు. ఇటీవల మృతిచెందిన కన్నడ పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌కు నివాళిగా ఈ ఏనుగుకు ఆయన పేరు పెట్టినట్లు అధికారులు తెలిపారు. అభిమానులు, సిబ్బంది విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పవర్‌స్టార్ చివరి రోజుల్లో ఈ శిబిరాన్ని సందర్శించారని.. ఇక్కడ ఏనుగులతో రెండు గంటల పాటు గడిపారని అధికారులు పేర్కొన్నారు.
తల్లికి దూరంగా..
రెండేళ్ల ఈ 'పునీత్ రాజ్‌కుమార్'ను(punit raj kumar news) ఇటీవల తల్లి నుంచి వేరు చేశారు అధికారులు. ఆ సమయంలో ఆ పిల్ల ఏనుగు(baby elephant) ప్రతిఘటించింది. కానీ తాళ్లతో బంధించి బలవంతంగా ఆ రెండు ఏనుగులను సిబ్బంది విడదీసి ఆ గున్న ఏనుగును వేరే ప్రాంతానికి తరలించారు. ట్రైనింగ్‌లో భాగంగానే ఇలా చేశామని.. మూడు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి ఆ తర్వాత శిక్షణ ప్రారంభిస్తామని సిబ్బంది చెప్పుకొచ్చారు.
ఇదీ చూడండి : పదో తరగతి తెలివితేటలతో 'డ్రగ్స్' ల్యాబ్.. చివరకు?