ETV Bharat / bharat

భారత్ జోడో యాత్రలో కమల్​ హాసన్​.. దిల్లీలో రాహుల్​తో కలిసి నడక - రాహుల్ జోడో యాత్ర లేటెస్ట్ న్యూస్

Rahul Bharat Jodo Yatra : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన 'భారత్‌ జోడో యాత్ర'లో ప్రముఖ సినీ నటుడు కమల్‌ హాసన్‌ పాల్గొననున్నారు. దిల్లీలో శనివారం రాహుల్‌తో కలిసి కమల్​ నడవబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

rahul bharat jodo yatra
రాహుల్ భారత్ జోడో యాత్ర
author img

By

Published : Dec 23, 2022, 6:06 PM IST

Rahul Bharat Jodo Yatra : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ.. భారత్ జోడో యాత్రను ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ప్రస్తుతం ఈ యాత్ర హరియాణాలో జరుగుతుంది. శనివారం దిల్లీలోకి జోడో యాత్ర ప్రవేశించనుంది. ఈ క్రమంలో మక్కల్​ నీది మయ్యం అధ్యక్షుడు, ప్రముఖ నటుడు కమల్ ​హాసన్ సహా కాంగ్రెస్ ఎంపీలు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబీకులు యాత్రలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ యాత్రలో దాదాపు 50 వేల మంది పాల్గొంటారని దిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి తెలిపారు.
కొద్ది రోజుల క్రితం మక్కల్ నీది మయ్యం పార్టీ పదాధికారుల సమావేశంలో రాహుల్ గాంధీ తనను భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని ఆహ్వానించారని కమల్​ హాసన్​ తెలిపారు. డిసెంబరు 24న యాత్రలో పాల్గొంటానని కమల్ చెప్పారు.

'శనివారం ఉదయం 6 గంటలకు దిల్లీలోని బదర్‌పుర్ సరిహద్దుకు భారత్​ జోడో యాత్ర చేరుకుంటుంది. అప్పుడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు యాత్రలో భాగమవుతారు. అనంతరం భోజన విరామం ఉంటుంది. విరామ సమయంలో రాహుల్ సహా మరికొందరు యాత్రికులు కారులో రాజ్​ఘాట్​, వీర్​ భూమి, శాంతివన్​ను సందర్శించి నివాళులర్పిస్తారు. 8 రోజుల విరామం తర్వాత మళ్లీ ప్రారంభమవుతుంది. దిల్లీ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌, హరియాణా, పంజాబ్‌ తర్వాత యాత్ర గమ్యస్థానమైన జమ్ముకశ్మీర్‌కు చేరుకుంటుంది.'

--అనిల్ చౌదరి, దిల్లీ కాంగ్రెస్ చీఫ్

సెప్టెంబరు 7న కన్యాకుమారిలో మొదలైన 'భారత్‌ జోడో యాత్ర' తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్​ మీదగా సాగి ప్రస్తుతం హరియాణాలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి కశ్మీర్‌ చేరుకోనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.