ETV Bharat / bharat

భర్తతో గొడవ.. పిల్లల గొంతుకోసి చంపిన భార్య - పిల్లలను హత్య చేసిన తల్లి

క్షణికావేశం చిన్నారుల పాలిట మృత్యుపాశం అయింది. కన్నపిల్లలనే కనికరం కూడా లేని ఓ తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతుకోసి హత్య(woman murders child) చేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ దారుణ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

murder
పిల్లల హత్య
author img

By

Published : Nov 12, 2021, 10:48 PM IST

భార్యాభర్తల మధ్య జరిగిన గొడవకు కన్నపిల్లలు బలయ్యారు. క్షణికావేశంలో కన్నతల్లే ఇద్దరు చిన్నారుల ప్రాణాలు(mother murders son) తీసింది. హత్యానంతరం మృతదేహాలున్న గదిలోనే ఉండిపోయింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ (uttar pradesh crime) బరేలీలో వెలుగుచూసింది.

ఇదీ జరిగింది..

బరేలీ(bareilly city news) భూటా పోలీస్ స్టేషన్ పరిధిలోని మట్కాపూర్ గ్రామంలో నివసించే బంటు.. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం అర్ధరాత్రి బంటు, అతని భార్య జయంతి మధ్య గొడవ(uttar pradesh crime) జరిగింది. దీంతో జయంతి.. పిల్లలు నిద్రిస్తున్న గదిలోకి వెళ్లి లోపలి నుంచి తాళం వేసుకుని పడుకుంది. అదే సమయంలో బంటు తన గ్రామంలోనే మరో ఇంట్లో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు.

ఉదయం బంటు వచ్చి తలుపు కొట్టేసరికి ఎలాంటి స్పందన లేదు. కొద్దిసేపటికే ఇరుగుపొరుగు వారు గుమిగూడారు. వారి సహాయంతో తలుపులు పగలగొట్టిన బంటు.. రక్తపు మడుగులో పడి ఉన్న చిన్నారుల మృతదేహాలను చూసి విలపించాడు.

ఐదు నెలల వయసున్న కుమార్తె కోమల్​తో పాటు, రెండేళ్ల కుమారుడు బాలకిషన్ గొంతు కోసి హత్య(woman murders children) చేసిన జయంతి పక్కనే కూర్చుని ఏడుస్తూ కనిపించింది. పిల్లల మృతదేహాలను చూసి జనం సైతం చలించిపోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న భూటా పోలీసులు.. చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. భర్త ఫిర్యాదు మేరకు భార్యను అరెస్ట్ చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.