ETV Bharat / bharat

రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు.. భారీ నగదుతో చిక్కిన ఎమ్మెల్యేలు

Congress MLA Jharkhand: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్‌ పోలీసులకు పట్టుబడ్డారు. ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం, విపక్ష భాజపా డిమాండ్‌ చేస్తున్నాయి.

భారీ నగదుతో పట్టుబడిన ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు

author img

By

Published : Jul 31, 2022, 4:35 AM IST

Updated : Jul 31, 2022, 6:28 AM IST

Congress MLA Jharkhand: ఝార్ఖండ్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు పెద్ద మొత్తంలో నగదుతో బంగాల్​లోని హావ్‌డాలో పోలీసులకు పట్టుబడ్డారు. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటన రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఎమ్మెల్యేలను ఇర్ఫాన్‌ అన్సారీ, రాజేశ్‌ కచ్చప్‌, నమన్‌ బిక్సాల్‌ కొంగరిలుగా గుర్తించారు. వీరు ఒక ఎస్‌యూవీ వాహనంలో బంగాల్‌లోని రాణిహటి వద్ద జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

"ఒక నల్ల కారులో పెద్ద మొత్తంలో డబ్బు రవాణా అవుతున్నట్లు మాకు సమాచారం అందింది. దీంతో వాహనాల తనిఖీ మొదలుపెట్టాం. ఇందులో భాగంగా ఝార్ఖండ్‌ ఎమ్మెల్యేల ఎస్‌యూవీని పరిశీలించినప్పుడు నగదు బయటపడింది. ఈ సొమ్మును లెక్కించడానికి యంత్రాలను తెప్పించాం. నగదు గురించి ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తున్నాం" అని హావ్‌డా ఎస్పీ (గ్రామీణ) స్వాతి భంగాలియా పేర్కొన్నారు. వాహనంలో ప్రజాప్రతినిధులతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని చెప్పారు. మరోవైపు జేఎంఎం నేతృత్వంలోని ఝార్ఖండ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బేరసారాలు జరుగుతున్నాయన్న వార్తల నేపథ్యంలో ఈ నగదు లభ్యమైందని తృణమూల్‌ కాంగ్రెస్‌ పేర్కొంది.

ఎమ్మెల్యేల వద్ద పట్టుబడ్డ సొమ్ము ఎక్కడి నుంచి వచ్చిందో కాంగ్రెస్‌ వివరణ ఇవ్వాలని ఝార్ఖండ్‌లో అధికార జేఎంఎం, విపక్ష భాజపా డిమాండ్‌ చేశాయి. రాష్ట్రంలోని హేమంత్‌ సొరెన్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి భాజపా ప్రయత్నిస్తోందని ఈ ఘటన స్పష్టంచేస్తున్నట్లు కాంగ్రెస్‌ ఆరోపించింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ అధినాయకత్వానికి సిఫార్సు చేస్తానని ఝార్ఖండ్‌ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు బంధు టిర్కే తెలిపారు.

ఇవీ చూడండి: 'సరైన దిశలోనే డ్రగ్స్​పై పోరు.. అప్పటివరకు తగ్గేదేలే'

Last Updated : Jul 31, 2022, 6:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.