ETV Bharat / bharat

ఉపఎన్నికల్లో సత్తా చాటిన ఆప్​, అప్నాదళ్​.. సీటు నిలబెట్టుకున్న బీజేడీ - అప్ ఫలితాల్లో సువార్ అసెంబ్లీ నియోజకవర్గం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు జరిగాయి. పంజాబ్​లోని జలంధర్ లోక్​సభ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికలో ఆప్ అభ్యర్థి విజయం సాధించారు. యూపీ, ఒడిశా, మేఘాలయలో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీలు గెలిచాయంటే?

jalandhar-lok-sabha-constituency-by-election-results-and-other-bypoll-results-2023
ఉపఎన్నికల ఫలితాలు
author img

By

Published : May 13, 2023, 8:29 PM IST

కర్ణాటక శాసనసభ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల ఉపఎన్నికల ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పంజాబ్, ఉత్తర్​ప్రదేశ్​, ఒడిశాతో పాటు మేఘాలయలో ఈ ఉపఎన్నికలు జరిగాయి.

పంజాబ్​-జలంధర్ లోక్​సభ నియోజకవర్గం..
పంజాబ్​లో కాంగ్రెస్ కంచుకోట అయిన జలంధర్ లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. ఆప్ అభ్యర్థి సుశీల్ రింకూ తన సమీప ప్రత్యర్థి కరమ్ జిత్ కౌర్ చౌదరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేసిన కరమ్​జిత్​ కౌర్ చౌదరిపై.. 58,691 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ గెలుపుపై పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా పనిచేస్తామని ఆయన పునరుద్ఘాటించారు. ఉప ఎన్నికలకు ముందే కాంగ్రెస్​ పార్టీకి రాజీనామా చేశారు రింకూ. అనంతరం ఆప్​లో చేరి.. ఆ పార్టీ తరుపున పోటీ చేశారు.

ఒడిశాలో-ఝార్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గం..
ఒడిశాలోని అధికార బిజూ జనతా దళ్(బీజేడీ) ఝార్సుగూడ అసెంబ్లీ స్థానాన్ని నిలుపుకుంది. బీజేడీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి డిపాలి దాస్.. తన సమీప ప్రత్యర్థి టంకధర్ త్రిపాఠిపై విజయం సాధించారు. బీజేపీ నుంచి పోటీ చేసిన త్రిపాఠిపై 48,721 ఓట్ల తేడాతో గెలుపొందారు. డిపాలి దాస్ తండ్రి నాబా కిషోర్ దాస్​.. 2023 జనవరిలో హత్యకు గురయ్యారు. ఆయన ఝార్సుగూడ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించేవారు. కిషోర్ దాస్..​ నవీన్ పట్నాయక్​ క్యాబినెట్​లో మంత్రిగా పని చేశారు. ఆయన మరణం వల్ల ఉపఎన్నిక అనివార్యమైంది.

మేఘాలయ- సోహియాంగ్ అసెంబ్లీ నియోజకవర్గం..
మేఘాలయలోని సోహియాంగ్ శాసనసభ స్థానంలో యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ(UDP) అభ్యర్థి సిన్షార్ కుపర్ రాయ్ థాబా 3,400 ఓట్లకు పైగా మోజారిటీతో విజయ ఢంకా మోగించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్​పీపీ అభ్యర్థి సమ్లిన్​పై.. సిన్షార్ విజయం సాధించారు. ఫిబ్రవరి 7న యూడీపీ అభ్యర్థి హెచ్‌డిఆర్ లింగ్డో మరణం కారణంగా ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.

ఉత్తర్ ప్రదేశ్-సువార్ అసెంబ్లీ నియోజకవర్గం..
ఉత్తర్ ప్రదేశ్ రాంపుర్ జిల్లాలోని సువార్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ-మిత్రపక్షం అప్నాదళ్ అభ్యర్థి షఫీక్ అహ్మద్ 8,724 ఓట్ల తేడాతో గెలుపొందారు. సమాజ్ వాద్ పార్టీ అభ్యర్థి అనురాథపై ఆయన విజయం సాధించారు. మరో నియోజకవర్గం ఛన్​బే అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో అప్నాదళ్ అభ్యర్థి రింకీ కోల్.. సమాజ్ వాదీ పార్టీకి చెందిన కీర్తి కోల్​పై 9,587 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.