ETV Bharat / bharat

IT Employees Car Rally ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీపై వైసీపీ సర్కార్ ఉక్కుపాదం.. భారీ పోలీసు నిర్బంధాల నడుమ రాజమండ్రి చేరిన ఉద్యోగులు - Protest Against CBN arrest

IT employees car rally protesting Chandrababu arrest : 'మా రాష్ట్రంలోకి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకుంటే ఎలా..? దేశంలోనే ఉన్నామా లేక ఇతర దేశాల్లో ఉన్నామా..' అని ఐటీ ఉద్యోగులు పోలీసులను ప్రశ్నించారు. చంద్రబాబుకు మద్దతుగా వెళ్తున్న తమను సరిహద్దులో నిలిపేయడంపై మండిపడ్డారు.

it_employees_car_rally
it_employees_car_rally
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:02 PM IST

IT employees car rally protesting Chandrababu arrest : చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ IT ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీని.. పోలీసులు ఆంక్షల చట్రంలో బంధించారు. ఆంధ్ర-తెలంగాణ సరిహద్దుల్లో బలగాలను మోహరించి.. ఐటీ ఉద్యోగులెవరూ రాష్ట్రంలోకి రాకుండా అడ్డగించారు. ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ సాధారణ ప్రయాణికులకూ ఆటంకాలు సృష్టించారు. రాజమహేంద్రవరంలోనూ పోలీస్‌ పికెట్ పెట్టి... ఎవరూ అటువైపు రాకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డ IT ప్రొఫెషనల్స్.. సొంత రాష్ట్రంలో అడ్డుపెట్టాలంటే ఇన్ని ఆంక్షలేంటని నిలదీశారు. ఇంత నిర్బంధంలోనూ చాకచక్యంగా రాజమండ్రికి వచ్చిన కొందరు సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు.. అక్కడి శిబిరంలో భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసి సంఘీభావం తెలిపారు.

Protests in America Against CBN Arrest: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఆమెరికాలో పెద్ద ఎత్తున ఆందోళనలు..

చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ, ఆయన కుటుంబసభ్యులకు సంఘీభావం తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వరకు IT ఉద్యోగులు చేపట్టిన కార్ల ర్యాలీపై... రాష్ట్ర పోలీసులు నిర్బంధకాండ ప్రయోగించారు. శనివారం రాత్రి నుంచే తెలంగాణ నుంచి ఏపీలోకి వచ్చే మార్గాల్లో భారీగా పోలీసులను మోహరించారు. NTR జిల్లా గరికపాడు, జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి, నల్లబండగూడెం, తిరువూరు, తూర్పుగోదోవరి జిల్లా దేవరపల్లి, గోపాలపురం వద్ద పోలీసు పికెట్లు ఏర్పాటుచేశారు. రోడ్లపై బారికేడ్లు పెట్టి పెద్దఎత్తున తనిఖీలు నిర్వహించారు. తెలంగాణ నుంచి వస్తున్న వాహనాలను తనిఖీ చేసిన తర్వాతే రాష్ట్రంలోకి అనుమతించారు. ర్యాలీకి వెళ్తున్నట్లు చిన్న అనుమానం వచ్చినా... వారి వాహనాలను సరిహద్దులోనే ఆపేశారు. ఈ పరిణామాలపై IT ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు కుటుంబసభ్యులకు అండగా ఉన్నామని చెప్పేందుకు ర్యాలీ చేపడితే... ఈ స్థాయిలో ఆంక్షలు, అడ్డంకులు ఏంటని మండిపడ్డారు. పోలీసుల తీరుతో సాధారణ ప్రయాణికులు సైతం తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడ్డారు.

TDP Agitations on CBN Arrest in AP: 'సైకో హటావో.. సైకిల్ బచావో'.. నినాదాలతో హోరెత్తించిన టీడీపీ శ్రేణులు..

రాజమహేంద్రరంలోనూ ఎక్కడికక్కడ పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేశారు. భువనేశ్వరి, బ్రాహ్మణి ఉన్న శిబిరానికి నాలుగువైపులా బారికేడ్లు పెట్టి బలగాలను మోహరించారు. బయటినుంచి వచ్చే కార్లను తనిఖీ చేశాకే ఆ మార్గంలోకి అనుమతించారు. ఈ నిర్బంధాలన్నింటినీ దాటుకుని వివిధ మార్గాల్లో రాజమహేంద్రరం చేరుకున్న కొందరు IT ఉద్యోగులు... శిబిరంలో ఉన్న భువనేశ్వరి, బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.

పుట్టిపెరిగిన రాష్ట్రానికి, ప్రాంతానికి శాంతియుతంగా ర్యాలీ ద్వారా వస్తుంటే ఇన్ని ఆంక్షలు ఎందుకని IT ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తంచేశారు. భారతదేశానికే పెద్ద ఆస్తిగా ఉన్న చంద్రబాబును కాపాడుకోవాలని రాష్ట్ర ప్రజలకు ఐటీ ప్రొఫెషనల్స్ సూచించారు.

చంద్రబాబు కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రాజమండ్రి వెళ్తున్న మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబుతో పాటు మరికొందరు తెలుగుదేశం నేతల వాహనాన్ని... పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల టోల్‌గేట్‌ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వెళ్లేందుకు అనుమతి లేదనడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం నేతలను పోలీసులు అనుమతించారు. తెలుగుదేశం నాయకులు, ఐటీ ఉద్యోగులపై పోలీసు నిర్బంధాల పట్ల నారా లోకేష్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తరకొరియా తరహా పరిస్థితులు ఉన్నాయని ధ్వజమెత్తారు. రాష్ట్ర సరిహద్దుల్లో ప్రజల వాట్సప్‌ డేటాను కూడా తనిఖీ చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.

NRIs agitation against CBN Arrest: చంద్రబాబు అరెస్టుపై ఎన్​ఆర్​ఐల ఆగ్రహం.. టాంజానియాలో క్యాండిల్ ర్యాలీలు..

IT Employees Car Rally : 'ఐటీ ఉద్యోగులమా.. ఉగ్రవాదులమా..?' స్వరాష్ట్రానికి వెళ్లకుండా పోలీస్ నిర్బంధంపై మండిపాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.