ETV Bharat / bharat

ఇస్రోలో సైంటిస్ట్ అవుతారా? రూ.లక్షన్నర జీతంతో ఉద్యోగాలు.. దరఖాస్తుకు కొద్దిరోజులే ఛాన్స్! - ఇస్రో సైంటిస్ట్ నోటిఫికేషన్

ఇస్రో, షార్, అంతరిక్ష శాఖలు ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఈ నోటిఫికేషన్లలో ఏఏ పోస్టులు ఉన్నాయో, వాటి వివరాలు ఏంటో తెలుసుకుందాం.

shar isro recruitment
isro recruitment 2023
author img

By

Published : May 4, 2023, 5:24 PM IST

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో), శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(షార్), అంతరిక్ష శాఖ, భారత ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. ఇందులో మొత్తం 92 పోస్టులకు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. పోస్టులను బట్టి విద్యార్హతలు వేర్వేరుగా ఉన్నాయి.

  • పోస్టులు
    • టెక్నికల్ అసిస్టెంట్
    • సైంటిఫిక్ అసిస్టెంట్
    • లైబ్రరీ అసిస్టెంట్-A
    • టెక్నీషియన్-B
    • డ్రాఫ్ట్స్‌మ్యాన్-బి పోస్టులను భర్తీ చేస్తున్నారు.
  • ఖాళీల వివరాలు
    • టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో సినిమాటోగ్రఫీ/ఫొటోగ్రఫీ పోస్టులు-2
    • ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ / ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్-02
    • టెక్నికల్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్-02
    • ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్-01
    • మెకానికల్ ఇంజినీరింగ్​లో 05 పోస్టులు

సైంటిఫిక్ అసిస్టెంట్ విభాగంలో కంప్యూటర్ సైన్స్-3, ఫిజిక్స్-3 పోస్టులు ఉన్నాయి. ఇక డ్రాఫ్ట్స్‌మెన్ విభాగంలో సివిల్-2, మెకానికల్-1 పోస్టులు ఉన్నాయి. లైబ్రరీ అసిస్టెంట్ 'A' విభాగంలో లైబ్రరీ అసిస్టెంట్ 'A'-2, కెమికల్-10, ఎలక్ట్రీషియన్-6, ఫిట్టర్-17, మెషీనిస్ట్-3, ఎలక్ట్రానిక్ మెకానిక్-13, డీజిల్ మెకానిక్-3, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్-1, ప్లంబర్-2, పంప్ ఆపరేటర్ కమ్ మెకానిక్-7, డీజిల్ మెకానిక్ హెచ్‌వీడీ లైనెన్స్-03, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్-01 పోస్టులు ఉన్నాయి

దరఖాస్తు గడువు
ఏప్రిల్ 26న దరఖాస్తు ప్రక్రియ మొదలవ్వగా.. మే 16వ తేదీతో గడువు ముగియనుంది. ఫీజు చెల్లించడానికి చివరి తేదీని మే 17గా నిర్ణయించారు. ఆ లోపు అభ్యర్థులందరూ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసి ఫీజు చెల్లించి ఉండాలి.

విద్యార్హతలు
టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో సినిమాటోగ్రఫీ, ఫొటోగ్రఫీ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సినిమాటోగ్రఫీ లేదా ఫొటోగ్రఫీలో ఫస్ట్ క్లాస్ డిప్లోమా చేసి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్ విభాగంలో మిగతా పోస్టులకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్‌ డిప్లోమా కలిగి ఉండాలి.

సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా ఫస్ట్ క్లాస్‌లో బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి. లైబ్రరీ అసిస్టెంట్ పోస్టులకు లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఫస్ట్ క్లాస్‌లో మాస్టర్ డిగ్రీ చేసినవారు అర్హులు.

వయో పరిమితి
అన్ని రకాల పోస్టులకు ఈ ఏడాది మే 16వ తేదీ నాటికి వయస్సు 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్​సీ, ఎస్​టీ, వికలాంగులకు వయో సడలింపు ఉంటుంది.
అప్లై చేసుకోవడం ఎలా..?
అధికారిక వెబ్‌సైట్ https://www.apps.shar.gov.in లోకి లాగిన్ అయ్యి మే 16లోగా మీ వివరాలు సమర్పించి దరఖాస్తు చేసుకోవాలి.

జీతభత్యాలు
సినిమాటోగ్రఫీ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ లెవల్-7 ఉద్యోగులకు నెలకు రూ.44,900 నుంచి రూ.1,42,400 వరకు జీతం ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగులకు కూడా రూ.44,900 నుంచి రూ.1,42,000 వరకు ఉంటుంది. ఇక టెక్నీషియిన్ B లెవల్ 3 ఉద్యోగులకు నెలకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉంటుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.