ETV Bharat / bharat

IRCTC కార్తీక మాసం స్పెషల్ టూర్ - 7 జ్యోతిర్లింగాల దర్శనం - స్టాచ్యూ ఆఫ్ యూనిటీ కూడా! - Sapta Jyotirlinga Darshan Yatra package details

IRCTC Sapta Jyotirlinga Darshan Yatra Full Details : కార్తిక మాసంలో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలనుకుంటున్నారా? మీ కోసమే.. ఇండియన్‌ రైల్వే కేటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ట్రిప్‌లో ఏకంగా 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC Sapta Jyotirlinga Darshan Yatra Full Details

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 15, 2023, 1:27 PM IST

IRCTC Sapta Jyotirlinga Darshan Yatra With Statue of Unity Package Details: కార్తీక మాసం మొదలైంది. ఈ మాసంలో జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని చాలా మంది భక్తులు భావిస్తారు. అయితే.. ఒకేసారి ఎక్కువ ప్రదేశాలను దర్శించడం రిస్క్. ఇంకా.. ఖర్చు కూడుకున్న పని. అందుకే.. చాలా మంది వెనకడుగు వేస్తారు. ఇలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ అదిరిపోయే టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ ట్రిప్‌లో ఏకంగా 7 జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పించింది. అంతేకాదు.. స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని కూడా చూడొచ్చు. ఆ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

షిరిడీ భక్తుల కోసం IRCTC రెండు సూపర్​ ప్యాకేజీలు - అతి తక్కువ ధరలో సాయి దర్శనం!

నవంబరు 18 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. విజయవాడ, ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్‌, నిజామాబాద్‌ స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం అయా రైల్వే స్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్‌ మొత్తం 12 రాత్రులు 13రోజులు కొనసాగుతుంది.

ప్రయాణం ఇలా..

  • నవంబర్‌ 18న విజయవాడలో రాత్రి 8 గంటలకు రైలు స్టార్ట్​ అవుతుంది. ఖమ్మం మీదుగా ప్రయాణం సాగుతుంది.
  • రెండో రోజు వేకువజామున 2:42 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకొని అక్కడ టూరిస్టులను ఎక్కించుకొని ప్రయాణం కొనసాగిస్తుంది.
  • మూడో రోజు ఉదయం 5:35 గంటలకు ఉజ్జయిని చేరుకుంటారు. బ్రేక్​ఫాస్ట్​ కంప్లీట్​ చేసుకుని ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస ఉంటుంది.
  • నాలుగో రోజు ఉదయం టిఫిన్‌ తిని రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించి ఓంకారేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం ఉజ్జయిని రైల్వే స్టేషన్‌ చేరుకొని వడోదరకు వెళ్తారు.
  • ఐదోరోజు ఉదయం 7:30 గంటలకు వడోదర చేరుకుంటారు. అక్కడ ముందుగా బుక్‌ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. కాసేపు రెస్ట్​ తీసుకున్న తర్వాత స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ (పటేల్ విగ్రహం)ని వీక్షిస్తారు. అనంతరం ద్వారక బయల్దేరుతారు.
  • ఆరో రోజు ద్వారకలో ద్వారకాదీశ్‌ ఆలయాన్ని వీక్షిస్తారు. రాత్రి బస అక్కడే ఉంటుంది.
  • ఏడో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక బెట్‌ ద్వారకను వీక్షించి, నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సాయంత్రానికి ద్వారకకు చేరుకుంటారు. తర్వాత సోమనాథ్‌కు బయల్దేరుతారు.
  • ఎనిమిదో రోజు సోమనాథ్‌లో కాస్త సేదతీరాక సోమనాథ్‌ జ్యోతిర్లింగాలయాన్ని దర్శించుకొన్నాక సాయంత్రం సోమనాథ్‌ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి మళ్లీ ప్రయాణం ప్రారంభమవుతుంది.
  • తొమ్మిదో రోజు రాత్రి నాసిక్‌లోనే బస ఉంటుంది.
  • పదో రోజు ఉదయం టిఫిన్‌ చేశాక త్రయంబకేశ్వరున్ని సందర్శించి తిరిగి నాసిక్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌కు వచ్చి పుణే పయనమవుతారు.
  • 11 రోజు ఉదయం టిఫిన్‌ చేశాక భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని ఔరంగాబాద్‌ బయల్దేరతారు.
  • 12 రోజు ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శించుకొని సికింద్రాబాద్‌కు పయనమవుతారు.
  • 13వ రోజు ఉదయం 5 గంటలకు సికింద్రాబాద్‌, మధ్యాహ్నం 1 గంటకు విజయవాడ చేరుకుంటారు. దీంతో సప్త జ్యోతిర్లింగాల దర్శనం పూర్తవుతుంది.

IRCTC Divya Dakshin Yatra and How to Book Online: ఐఆర్​సీటీసీ సరికొత్త ప్యాకేజీ.. రూ.14 వేలకే 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఇప్పుడే బుక్ చేసుకోండిలా.!

ఐఆర్‌సీటీసీదే ఫుడ్‌..: ఉదయం-టీ, టిఫిన్​, మధ్యాహ్నం, రాత్రి భోజనం అంతా రైల్వే సిబ్బందే చూసుకుంటారు. రాత్రి బస కూడా రైల్వేదే బాధ్యత. యాత్రికులకు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది. పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ఎంట్రీ ఫీజులు ఉంటే మాత్రం వ్యక్తులే చెల్లించుకోవాలి.

టికెట్‌ ధర :

  • ఎకానమీలో అంటే స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణానికి ఒక్కో టికెట్‌ ధర (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.21వేలు, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.19,500 చెల్లించాలి.
  • స్టాండర్ట్‌లో అంటే థర్డ్‌ ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.32,500, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.31,000 చెల్లించాలి.
  • కంఫర్ట్‌లో 2ఏసీ ప్రయాణానికి (ట్విన్‌, ట్రిపుల్‌ షేరింగ్‌) రూ.42,500, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.40,500 చెల్లించాలి.
  • క్యాన్సిలేషన్‌ పాలసీ ప్రకారం.. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు క్యాన్సిల్‌ చేస్తే ఎలాంటి రీఫండ్​ ఉండదు.
  • ఈ టూర్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి

IRCTC Punya Kshetra Yatra Details and How to Book Online..?: రూ.16 వేలకే 6 పుణ్యక్షేత్రాల దర్శనం... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ.. ఎలా బుక్​ చేయాలంటే..?

How to get Discounts on Train Tickets : రైలు టికెట్లు డిస్కౌంట్లో కావాలా నాయనా..? ఇలా చేయండి​!

Travel in Third AC Class with Sleeper Ticket : వావ్.. సూపర్ స్కీమ్! స్లీపర్ క్లాస్ టికెట్‌తో.. ఫ్రీగా థర్డ్ ఏసీ జర్నీ!

For All Latest Updates

TAGGED:

irctc
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.