ETV Bharat / bharat

ఐపీఎల్​ లైవ్​పై హైకోర్టు కీలక తీర్పు- ఇక అవన్నీ బంద్! - టాటా ఐపీఎల్​

IPL illegal streaming: ఐపీఎల్​ మ్యాచ్​లను అనుమతి లేకుండా అక్రమంగా ప్రసారం చేస్తున్న కొన్ని వెబ్​సైట్లపై నిషేధం విధించాలని దిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎల్​ ప్రసారాలకు సంబంధించి స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​తో పాటు ఇతరుల పెట్టుబడులను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపింది.

delhi high court
దిల్లీ హైకోర్టు
author img

By

Published : Mar 15, 2022, 3:56 PM IST

IPL illegal streaming: సరైన అనుమతులు లేకుండా క్రికెట్​ మ్యాచ్​లను ప్రసారం చేస్తున్న వెబ్​సైట్లపై దిల్లీ హైకోర్టు కొరడా ఝులిపించింది. ఇలా అన్​లైన్​ ప్రసారాలకు పాల్పడుతున్న వెబ్​సైట్లను తక్షణమే బ్లాక్​ చేయాలని ఆదేశించింది. మరి కొద్ది రోజుల్లో జరగనున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్​ను దృష్టిలో ఉంచుకొని దిల్లీ హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

మార్చి 26 నుంచి ప్రారంభంకానున్న టాటా ఐపీఎల్-2022కు సంబంధించి పిటిషన్ దాఖలు చేసిన స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్​తో పాటు ఇతరుల పెట్టుబడులను రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దిల్లీ హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అక్రమంగా ప్రసారాలు చేస్తున్న వెబ్​సైట్​లను వెంటనే బ్లాక్​ చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

  • http://live.flixhub.net
  • nlive.flixhub.net
  • http:titichsports.com
  • nstitichsports.com
  • http://vipleague.im
  • nvipleague.im
  • maxsport.one
  • http://t20wc.nl
  • nt20wc.nl
  • http://vipstand.se
  • nvipstand.se
  • stream.btolat.online

పైన పేర్కొన్న వెబ్​సైట్లతో పాటు మరి కొన్నింటిని కూడా బ్లాక్​ చేయాలని కేంద్ర సమాచార, సాంకేతిక శాఖ అధికారులకు దిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవి మాత్రమే గాక మరే ఇతర వెబ్​సైట్లు టాటా ఐపీఎల్​ 2022 మ్యాచ్‌లను చట్టవిరుద్ధంగా లేక అనధికారికంగా ప్రసారం చేస్తే.. అందుకు సంబంధించిన సాక్ష్యాలతో ఫిర్యాదుదారులు అఫిడవిట్ దాఖలు చేయవచ్చని పేర్కొంది.

తమ ప్రసార హక్కులను ఉల్లంఘించి, నష్టం చేకూర్చిన వారిపై శాశ్వత నిషేధం విధించాలని కోరుతూ స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారిస్తున్న నేపథ్యంలో దిల్లీ హైకోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:

గుప్తనిధుల కోసం 9 ఏళ్ల చిన్నారి బలి.. అత్త, మామ అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.