ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. దిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బెంగళూరుకు వెళ్తున్న విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజిన్‌లో చెలరేగిన మంటలను గుర్తించిన వెనక ఉన్న స్పైస్‌జెట్ విమాన పైలట్... అధికారులకు సమాచారమిచ్చి, అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఘటన సమయంలో విమానంలో మెుత్తం 177 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి అందులోని ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. శుక్రవారం రాత్రి 10 గంటలకు ఈ ఘటన జరగ్గా.. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు వీడియో తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
-
IndiGo A320 aborts its takeoff following an engine fire on departure from Delhi Indira Gandhi Airport, India. All passengers and crew evacuated the aircraft safely. https://t.co/koQNUzl9XM
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
📹 PriyankaaKumarr pic.twitter.com/WVSe7aRfBw
">IndiGo A320 aborts its takeoff following an engine fire on departure from Delhi Indira Gandhi Airport, India. All passengers and crew evacuated the aircraft safely. https://t.co/koQNUzl9XM
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2022
📹 PriyankaaKumarr pic.twitter.com/WVSe7aRfBwIndiGo A320 aborts its takeoff following an engine fire on departure from Delhi Indira Gandhi Airport, India. All passengers and crew evacuated the aircraft safely. https://t.co/koQNUzl9XM
— Breaking Aviation News & Videos (@aviationbrk) October 28, 2022
📹 PriyankaaKumarr pic.twitter.com/WVSe7aRfBw
కాగా, ఈ ఘటనపై డీజీసీఏ స్పందించింది. విమానం రెండో ఇంజిన్‌లో తలెత్తిన వైఫల్యాల వల్ల మంటలు చెలరేగినట్లు డీజీసీఏ తెలిపింది. ఈ సమయంలో భారీ శబ్దాలు వచ్చాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో విమానం టేకాఫ్ అయ్యేందుకు అనుమతి నిరాకరించినట్లు వివరించింది. విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది. 'డీజీసీఏ తరఫున ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తాం. ఘటనకు కారణాలేంటన్న విషయాలను కనుగొంటాం. అందుకు అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటాం' అని డీజీసీఏ స్పష్టం చేసింది.