ETV Bharat / bharat

స్వదేశీ యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం సక్సెస్ - బాలాసోర్​ ప్రయాగం

Anti Ship Missile Success: భారత నావికాదళం.. దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశా బాలేశ్వర్​లో జరిగిన ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్​లో షేర్ చేసింది.

Indian Navy successfully test-fires naval anti-ship missile

author img

By

Published : May 18, 2022, 3:19 PM IST

Anti Ship Missile Tests Success: భారత నావికాదళం బుధవారం నౌకా విధ్వంసక క్షిపణి(యాంటీ షిప్ మిసైల్‌) ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. ఒడిశా బాలేశ్వర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్​లో(ఐటీఆర్) ఈ ప్రయోగాన్ని నిర్వహించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి నౌకాదళ యాంటీ షిప్ క్షిపణి.. తొలి పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అధికారులు తెలిపారు. "ఈ క్షిపణి ప్రయోగం సాంకేతికతలో స్వావలంబన సాధించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు" అని నేవీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. భారత నౌకాదళం.. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్​డీవో)తో కలిసి ఈ పరీక్షను నిర్వహించింది.

'దేశీయ' యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం విజయవంతం

సీకింగ్ 42బి హెలికాప్టర్ ద్వారా క్షిపణిని ప్రయోగిస్తున్న వీడియోను ట్విట్టర్‌లో భారత నావికాదళం షేర్ చేసింది. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి.. యాంటీ-షిప్ వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించిన ఒక నెల తర్వాత కొత్త క్షిపణిని పరీక్షించింది.

Indian Navy successfully test-fires naval anti-ship missile
యాంటీ షిప్ మిసైల్‌ ప్రయోగం విజయవంతం

భారత నౌకాదళానికి చెందిన రెండు ఫ్రంట్‌లైన్ యుద్ధనౌకలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం ప్రారంభించారు. ఐఎన్ఎస్​ సూరత్, ఐఎన్ఎస్​ ఉదయగిరి అనే నౌకలను ముంబయిలోని మజాగాన్ డాక్స్ లిమిటెడ్(ఎండీఎల్​)లో ప్రారంభించారు. ఐఎన్ఎస్​ సూరత్ పీ15బి తరగతికి చెందిన నాలుగో గైడెడ్-మిసైల్ డిస్ట్రాయర్ కాగా, ఐఎన్ఎస్​ ఉదయగిరి పీ17ఏ తరగతికి చెందిన రెండవ స్టెల్త్ ఫ్రిగేట్.

ఇవీ చదవండి:

ప్రాణం తీసిన 'ఉప్పు'.. గోడ కూలి 12 మంది దుర్మరణం

రాజీవ్ హత్య కేసు దోషి విడుదల- సుప్రీం 'అసాధారణ' తీర్పు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.