ETV Bharat / bharat

'యుద్ధ విమానాల పవర్'​లో భారత్ ర్యాంక్​ @ 4 - భారత యుద్ధ విమానాలు

Indian military aircraft fleet: దేశంలో 700 యుద్ధ విమానాలు, 253 రవాణా విమానాలు, 805 యుద్ధ హెలికాప్టర్లు యాక్టివ్​గా ఉన్నాయి. దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్​ మిలిటరీ ఎయిర్​క్రాప్ట్​ ఫ్లీట్​ ఉన్న దేశంగా భారత్​ నిలిచింది. తొలి స్థానంలో అమెరికా కొనసాగుతోంది.

Indian military aircraft fleet
భారత యుద్ధ విమానాలు
author img

By

Published : Dec 16, 2021, 2:22 PM IST

Updated : Dec 16, 2021, 2:43 PM IST

Indian military aircraft fleet: ప్రపంచంలోనే 4వ అతిపెద్ద యాక్టివ్​ మిలిటరీ ఎయిర్​క్రాప్ట్​​ ఫ్లీట్​ ఉన్న దేశంగా.. భారత్​ నిలిచింది. గతేడాది కూడా దేశం ఇదే స్థానాన్ని దక్కించుకుంది. దేశంలో త్రివిధ దళాలకు చెందిన మొత్తం 2,182 విమానాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను ఫ్లైట్​ గ్లోబల్​ అనే సంస్థ తన వార్షిక వరల్డ్​ ఎయిర్​ఫోర్స్​ డైరక్టరీలో పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటరీ విమానాల్లో భారత్​ వాటా 4శాతంగా ఉంది. ఫ్లీట్​లో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, ట్యాంకర్లు, ట్రాన్స్​పోర్టర్లు, ట్రైనర్లు, స్పెషల్​ మిషన్స్​ ఉంటాయి.

Indian military aircraft list

  • యుద్ధ విమానాలు(694), రవాణా విమానాలు(253), యుద్ధ హెలికాప్టర్ల(805) జాబితాలో దేశం 4వ స్థానంలో నిలబడగా.. స్పెషల్​ మిషన్​(71) జాబితాలో 5, ట్రైనర్స్​(353) జాబితాలో 6వ స్థానాన్ని దక్కించుకుంది.
  • యుద్ధ విమానాల సంఖ్యలో మాత్రం భారత్​ తీవ్ర లోటును ఎదుర్కొంటోంది. దేశంలో సుఖోయ్​-30(248), జాగ్వార్​(130), మిగ్​-21​(128), మిగ్​-29(65), మిరాజ్​ 2000(45), తేజస్​(19), రఫేల్​(23) మాత్రమే ఉన్నాయి. మరో 7 రఫేల్​ విమానాలు.. రిపోర్టు తయారు చేసిన తర్వాత దేశానికి చేరాయి. దీంతో మొత్తం విమానాల సంఖ్య 700కు చేరింది.
  • ట్యాంకర్ల కొరత కూడా తీవ్రంగా ఉంది. దేశంలో ఆరు ఎల్​-78 ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి. వాటిల్లోనూ సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో ట్యాంకర్ల జాబితాలో దేశం టాప్​-10లో కూడా లేదు.

ప్రపంచవ్యాప్తంగా ఇలా..

  • నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 53,271 క్రియాశీల యుద్ధ విమానాలు ఉన్నాయి. అమెరికా(13,246) టాప్​లో ఉంది. రష్యా(4,173), చైనా(3,285) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దక్షిణ కొరియా(1,595), జపాన్​(1,449), పాకిస్థాన్​(1,387).. భారత్​ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
  • అయితే గతేడాదితో పోల్చితే.. క్రియాశీల యుద్ధ విమానాల సంఖ్య కొంత తగ్గింది. తాలిబన్ల ఆక్రమణ అనంతరం అఫ్గానిస్థాన్​లో ఉన్న కొన్ని విమానాలు యాక్టివ్​గా లేవని నివేదిక పేర్కొంది.
  • అత్యాధునిక ఎఫ్​-16 యుద్ధవిమానాలు ప్రపంచవ్యాప్తంగా 2,248 ఉన్నాయి. యుద్ధ విమానాల్లో వీటి వాటా 15శాతం. ఆ తర్వాతి స్థానాల్లో సుఖోయ్​(1,063) ఉంది. భారత దేశంలో 248 సుఖోయ్ విమానాలు తిరుగుతున్నాయి.

అమెరికా యుద్ధ విమానాల సంఖ్య ఆందోళనకరంగా ఉందని నివేదిక పేర్కొంది. చైనా, రష్యా వంటి శత్రుదేశాల నుంచి ముప్పు ఎదురవుతున్నా.. అగ్రరాజ్యం శక్తిసామర్థ్యాలూ స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలిపింది.

ఇదీ చూడండి:- జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమర వీరులకు ప్రధాని నివాళి

Last Updated : Dec 16, 2021, 2:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.