పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి తరలిస్తున్న రూ.200 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం పట్టుకుంది. అరేబియా మహాసముద్రంలో బోటు ద్వారా తరలిస్తున్న 40 కిలోల హెరాయిన్‌ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళం, కోస్టుగార్డు సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నాయి. ఈ ఘటనలో బోటును సీజ్ చేయడం సహా ఆరుగురు పాకిస్థానీలను అరెస్టు చేశారు.
పంజాబ్‌కు తరలించేందుకు..
కచ్ జిల్లా జకావ్ ఓడరేవు సమీపంలోని సముద్రంలో చేపలు పట్టే పడవ ద్వారా హెరాయిన్ తరలిస్తున్నట్లు కోస్టుగార్డు, ఏటీఎస్ సిబ్బంది గుర్తించారు. వెంటనే సంయుక్త ఆపరేషన్ చేపట్టి దుండగులను పట్టుకున్నారు. మాదకద్రవ్యాలను గుజరాత్ తీరానికి చేర్చి.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో పంజాబ్ తరలించాలని పథక రచన చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి: కశ్మీర్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ మినీ బస్సు.. 11 మంది మృతి
బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం.. అంబులెన్సు ఆలస్యం.. జేసీబీలో ఆస్పత్రికి..