ETV Bharat / bharat

'భారతీయుల తరలింపునకు ఏ అవకాశాన్నీ వదల్లేదు' - rahul in indian evacuation plan

Ukraine crisis: ఉక్రెయిన్​లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ విడిచిపెట్టడం లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. మార్చి 7న యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న సోన్​భద్ర జిల్లాలో నిర్వహించిన ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు. అటు.. భారతీయుల తరలింపు ప్రణాళికను తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

Ukraine crisis
ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు
author img

By

Published : Mar 2, 2022, 6:45 PM IST

Ukraine crisis: ఉక్రెయిన్​ నుంచి భారతీయుల తరలింపునకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టట్లేదని స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. భారత దేశం అంతకంతకూ శక్తిమంతంగా మారుతున్నందునే ఈ ప్రక్రియ సాధ్యమవుతోందని చెప్పారు. సైన్యం ధైర్యాన్ని, 'మేక్ ఇన్ ఇండియా'ను శంకించేవారు భారత్​ను బలమైన దేశంగా మార్చలేరని ప్రతిపక్షాలనుద్దేశిస్తూ విమర్శించారు. అవినీతిపరులు మళ్లీ బలపడితే.. పేదల సొమ్మును దోచుకుంటారని అన్నారు. మార్చి 7న యూపీలో చివరి విడత ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోన్​భద్ర జిల్లాలో ప్రచార సభలో పాల్గొన్నారు మోదీ.

"ఉక్రెయిన్​ నుంచి భారతీయులను రక్షించడానికి భారత్ ప్రాధాన్యమిస్తోంది. ఇందుకోసం 'ఆపరేషన్ గంగ'ను ప్రారంభించాం. పర్యవేక్షణ కోసం నలుగురు మంత్రులను పంపాం. సైన్యం, వాయుసేనను రంగంలోకి దించాం. ఏ ఒక్క అవకాశాన్నీ వదలిపెట్టట్లేదు. భారత్ అభివృద్ధి చెందుతున్నందునే ఇది సాధ్యమవుతోంది. కుటుంబ పాలకులు దేశంలో కరోనా టీకాను, సైన్యం సాహసాలను, మేక్ ఇన్​ ఇండియాను పరిహాసం చేశారు. ఇలాంటివారు బలమైన దేశాన్ని తయారు చేయలేరు.'

-ప్రధాని నరేంద్ర మోదీ

భారత సహజ వనరులను గత పాలకులు దుర్వినియోగం చేశారని మోదీ ఆరోపించారు. అయినప్పటికీ స్వదేశంలో ఏ అభివృద్ధి చేయలేదని దుయ్యబట్టారు. సోన్​భద్ర జిల్లా ఖనిజ వనరుల్లో కొంత భాగాన్ని ఆ జిల్లా అభివృద్ధికి కేటాయించినట్లు పేర్కొన్నారు. గిరిజన తెగలకు గౌరవప్రదమైన స్థానం కల్పించినట్లు చెప్పారు. గత పాలకులు 10 అటవీ వస్తువులకు మాత్రమే ఎమ్​ఎస్​పీ కల్పిస్తే.. తాము మాత్రం ఆ సంఖ్యను 90కి పెంచినట్లు స్పష్టం చేశారు.

భారతీయుల తరలింపు ప్రణాళిక ఎక్కడ?

Ukraine Evacuation News: ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడానికి ప్రభుత్వం ఏ ప్రణాళికను అనుసరిస్తోందో తెలపాలని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. 'ఇప్పటివరకు ఎంత మందిని తరలించారు? ఇంకా ఎంత మంది ఉక్రెయిన్​లో ఉన్నారు? ప్రాంతాలవారీగా తరలింపు ప్రణాళిక ఏది?' అని ప్రశ్నిస్తూ రాహుల్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: 'రష్యా మీదుగా భారతీయుల తరలింపు.. సకాలంలోనే 'ఎస్400''

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.