ETV Bharat / bharat

వర్షాలపై ఐఎండీ చల్లని కబురు.. ఈసారి దంచికొట్టుడే! - వర్షాలు న్యూస్

దేశంలో ఈసారి వర్షాలు భారీగా కురవనున్నాయి. ఏప్రిల్​లో అంచనా వేసినదానికంటే అధికంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తాజాగా వెల్లడించింది. దీర్ఘకాలం సగటుకు 103 శాతం వర్షాలు పడతాయని తెలిపింది.

India Rains
India Rains
author img

By

Published : May 31, 2022, 3:11 PM IST

India Rains 2022: భారత వాతావరణ శాఖ గుడ్​న్యూస్ చెప్పింది. ఈ వానాకాలంలో భారీగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముందుగా అంచనా వేసినదానికంటే అధికంగానే వానలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. దీర్ఘకాలం సగటుకు 103 శాతం వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఏప్రిల్​లో దీర్ఘకాల సగటులో 99 శాతం మాత్రమే వానలు పడొచ్చని లెక్కగట్టింది ఐఎండీ. తాజాగా రుతుపవనాల కదలికలు చురుగ్గా ఉన్న నేపథ్యంలో అంచనాలను సవరించింది.

More Rains in India: దేశంలోని చాలా వరకు భూభాగంలో వర్షాలు మెరుగ్గా పడతాయని మోహపాత్ర తెలిపారు. ఈ మేరకు ప్రస్తుత సీజన్​కు సవరించిన అంచనాల గణాంకాలను వెలువరించారు. మధ్య, ద్వీపకల్ప భారతదేశంలో దీర్ఘకాలంలో సగటుకు 106 శాతం వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈశాన్య ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే తక్కువ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు.
Monsoon in Kerala 2022: ఇప్పటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. సాధారణంగా జూన్ 1న కేరళకు రావాల్సిన నైరుతి రుతుపవనాలు మూడు రోజులు ముందుగానే వచ్చేశాయి. ఇప్పటికే కేరళలో వర్షాలు ప్రారంభయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.

Rains in Delhi: మరోవైపు, సోమవారం దేశ రాజధాని దిల్లీని ఉరుములు, పిడుగులు, బలమైన గాలులతో కూడిన వర్షం కుదిపేసింది. తీవ్రమైన ఎండతో వేడెక్కిన నగరాన్ని సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా పెనుగాలులు చుట్టుముట్టాయి. గంటకు 100 కి.మీ. వేగంతో తుపానును తలపించాయి. ఆ వెంటనే ఉరుములు..కుండ పోతగా వర్షం... తూర్పు, సెంట్రల్‌ దిల్లీలోని పలు ప్రాంతాల్లో భీతావహమైన పరిస్థితులు నెలకొన్నాయి. చెట్లు వేళ్లతో సహా పెకిలించుకుపోయి రహదారులపై పడ్డాయి. ఈ వార్త పూర్తి కథనం కోసం లింక్​పై క్లిక్ చేయండి..

ఇదీ చదవండి: 'నీ పొట్ట ఏంటి నాయనా.. బస్తాలా ఉంది! ఏం తింటున్నావ్​?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.