India covid cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. 24 గంటల వ్యవధిలో 7,495 కేసులు నమోదయ్యాయి. మరో 434 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,960 మంది కోలుకున్నారు.
మొత్తం కేసులు: 3,47,65,976
మొత్తం మరణాలు: 4,78,759
యాక్టివ్ కేసులు: 78,291
కోలుకున్నవారు: 3,42,08,926
Vaccination in India
దేశంలో టీకా పంపిణీ శరవేగంగా కొనసాగుతోంది. బుధవారం మరో 70,17,671మందికి వ్యాక్సిన్లు అందించారు. దీంతో ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,39,69,76,774కు చేరింది.
Covid world cases
అటు, ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 8,85,052 కేసులు వెలుగులోకి వచ్చాయి. 7,220 మంది ప్రాణాలు కోల్పోయారు.
- అమెరికాాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 2,27,605 కేసులు బయటపడ్డాయి. ఒక్కరోజే 1544 మంది ప్రాణాలు కోల్పోయారు. 104,606 మంది కోలుకున్నారు.
- యూకేలో కరోనా విలయతాండవం చేస్తోంది. కొత్త కేసుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మరణాల సంఖ్య 147,573కు పెరిగింది.
- ఫ్రాన్స్‌లో 84 వేలకు పైగా కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 170 మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 87 లక్షల 98 వేలకు చేరుకుంది.
- రష్యాలో కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదవుతోంది. మరో 1,020 మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు. ఆ దేశంలో 25 వేల కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఇదీ చదవండి: బ్రిటన్‌లో కొవిడ్ పంజా.. తొలిసారి లక్షకుపైగా కేసులు