India Coronavirus Cases: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటల నుంచి మంగళవారం ఉదయం 8 గంటల వరకు 8,586 మందికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 48 మంది కరోనాతో మరణించారు. ఒక్కరోజులో 11,726 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.59 శాతం వద్ద ఉంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.19 శాతానికి తగ్గింది. యాక్టివ్ కేసులు 0.22 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 3.31 శాతంగా ఉన్నాయి.
- మొత్తం కేసులు: 4,43,57,546
- క్రియాశీల కేసులు: 96,506
- మొత్తం మరణాలు: 5,27,416
- కోలుకున్నవారు: 4,37,33,624
Vaccination India: భారత్‌లో సోమవారం 29,25,342 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2,10,31,65,703కు చేరింది. సోమవారం మరో 3,91,281 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.
World Coronavirus Cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. సోమవారం మరో 5 లక్షల 30 వేలకుపైగా కేసులు వెలుగుచూశాయి. మరణాలు భారీగా పెరిగాయి. ఒక్కరోజులో 1390 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసులు 60,14,52,112 కోట్లకు చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్‌తో 64,73,747 మంది మరణించారు. ఒక్కరోజే 8,52,315 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 57,59,61,246కు చేరింది.
- జపాన్‌లో కొవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సోమవారం మరో 2,17,875 మంది వైరస్ బారినపడ్డారు. మరో 228 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దక్షిణ కొరియాలో కొత్తగా 59 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 65 మంది మరణించారు.
- రష్యా, అమెరికాల్లో మరో 30 వేలకుపైగా కొత్త కేసులు వచ్చాయి.
ఇవీ చదవండి: 14 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం, తీవ్రంగా కొట్టి, రోడ్డుపై వదిలేసి
12ఏళ్ల బాలికకు కడుపు నొప్పి, ఆస్పత్రికి వెళ్తే ప్రసవం, రేపిస్ట్ కోసం వేట